Viral Video: ఇదేం మిక్సింగ్‌రా బాబోయ్.. పాన్ మసాలాతో ఇతను చేసిన డ్రింక్ చూడండి..
ABN , Publish Date - Dec 01 , 2024 | 01:55 PM
వింత వింత రెసిపీలతో వంట చేసే వారిని నిత్యం చూస్తుంటాం. అలాగే విచిత్రమైన వస్తువులను మిక్స్ చేసి టీలు, కూల్‌డ్రింక్స్‌ను తయారు చేసే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి..
వింత వింత రెసిపీలతో వంట చేసే వారిని నిత్యం చూస్తుంటాం. అలాగే విచిత్రమైన వస్తువులను మిక్స్ చేసి టీలు, కూల్‌డ్రింక్స్‌ను తయారు చేసే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ మసాలాతో కూల్‌డ్రింక్ చేయడాన్ని చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇదేం మిక్సింగ్‌రా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కూల్ డ్రింక్స్‌ను (Cool drinks) విక్రయిస్తున్న ఓ వ్యక్తి విచిత్రమైన సోడా తయారు చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం అతను ముందుగా ఓ ప్లాస్టిక్ గ్లాసు తీసుకుని, అందులో సోడా వాటర్ (Soda water) నింపుతాడు. తర్వాత అందులో నిమ్మరసం వేసి మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత అల్లం, కొత్తిమీర తదితరాలను మిక్స్ చేసి మళ్లీ మిక్స్ చేస్తాడు.
Viral Video: సింగల్‌గా వెళ్లిన సింహం.. అడవి దున్నలను చుట్టుముట్టి మరీ.. చివరకు..
ఆ తర్వాత అతను పాన్ మసాలా (Pan masala) ప్యాకెట్‌ను తెరచి, అందులో వేసేస్తాడు. దాన్ని ఫైనల్‌గా బాగా మిక్స్ చేస్తాడు. చివరగా అందులో స్ట్రా వేసి, దానికి పాన్ మసాలా ఖాళీ ప్యాకెట్‌ను పెట్టి అలంకరిస్తాడు. ఇలా పాన్ మసాలా ప్యాకెట్‌తో విచిత్రమైన కూల్ డ్రింక్ తయారు చేసిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాక్కూడా కూల్‌డ్రింక్ చేస్తారా’’.. అంటూ కొందరు, ‘‘పాన్ మాసాలాతో కూల్‌డ్రింక్ ఏంట్రా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లు, 43.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..