Share News

Viral Video: క్రికెటర్ కాబోయి పోలీస్ అయ్యాడేమో.. మొత్తానికి బాట్స్‌మన్‌కు చుక్కలు చూపించాడుగా..

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:56 PM

వినూత్న విన్యాసాలు, వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాగే క్రికెట్‌కు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు చూసేందుకు సింపుల్‌‌గా కనిపిస్తున్నా.. క్రికెట్‌లో అమితమైన టాలెంట్ కలిగి ఉంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ..

Viral Video: క్రికెటర్ కాబోయి పోలీస్ అయ్యాడేమో.. మొత్తానికి బాట్స్‌మన్‌కు చుక్కలు చూపించాడుగా..

వినూత్న విన్యాసాలు, వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాగే క్రికెట్‌కు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు చూసేందుకు సింపుల్‌‌గా కనిపిస్తున్నా.. క్రికెట్‌లో అమితమైన టాలెంట్ కలిగి ఉంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఇతను క్రికెటర్ కాబోయి పోలీస్ అయ్యాడేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు నెట్స్‌లో క్రికెట్ (Cricket) ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంతలో ఓ పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) అక్కడికి వెళ్తాడు. వారితో పాటూ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతాడు. బాంతిని తీసుకుని బౌలింగ్ చేసేందుకు వెళ్తాడు. అయితే అంతా అతడిని తేలిగ్గా తీసుకుంటారు. బౌలింగ్ సరిగ్గా చేయలేడని అనుకుంటారు.

Viral Video: యాక్టింగ్ ఇరగదీశారు కదరా.. ప్రియురాలికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా.. ఎలా ప్లేట్ మార్చారంటే..


ఇలా వారంతా అనుకుంటుండగానే.. బంతిని తీసుకుని పరుగెత్తుకుంటూ (policeman bowling) వచ్చి బౌలింగ్ చేస్తాడు. మొదటి బంతికే బ్యాట్స్‌మన్‌ను క్లీన్‌బౌల్డ్ చేస్తాడు. ఇలా మొత్తం మూడు బంతులు విసిరి రెండు సార్లు బ్యాటర్‌ను అవుట్ చేశాడు. ఈ పోలీసు బౌలింగ్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీస్ వృత్తిలో ఉంటూ కూడా క్రికెట్‌లో అతడు కనబరచిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది.

Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పోలీస్ టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘టాలెంట్ ఒకరి సొత్తు కాదు అని అంటే ఇదేనేమో’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింగల్‌గా వెళ్లిన సింహం.. అడవి దున్నలను చుట్టుముట్టి మరీ.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 03 , 2024 | 02:56 PM