Share News

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:22 PM

Watch Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం చూస్తు్న్నాం. కొందరు ఇళ్లల్లోని వస్తువులతోనే వింత వింత వస్తువులను తయారు చేస్తుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, ఫ్యాన్లను వినూత్నంగా ఉపయోగించడం కూడా చూస్తున్నాం. తాజాగా..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Man Hangs Phone By young woman's Hair

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం చూస్తు్న్నాం. కొందరు ఇళ్లల్లోని వస్తువులతోనే వింత వింత వస్తువులను తయారు చేస్తుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, ఫ్యాన్లను వినూత్నంగా ఉపయోగించడం కూడా చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి యువతి జడను విచిత్రంగా ఉపయోగించి అంతా అవాక్కయ్యేలా చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘యువతి జడను ఇలా చేశాడేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బస్సులో కూర్చుని ఉండగా.. వెనుక కూర్చున్న వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. యువతి జడను చేతిలోకి తీసుకున్న అతను.. తన ఫోన్ కవర్‌ను ఓ వైపు ఉంచాడు. దానిపై ఫోన్‌‌ను పెట్టడంతో చివరకు ఆమె జడ కాస్తా.. ఫోన్ స్టాండ్‌గా మారిపోతుందన్నమాట.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న గంటను 15సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇలా యువతి జుట్టుకు తన ఫోన్‌ను వేలాడదీసి, (man hung the phone by woman's hair) తాపీగా సినిమాలు చూడడం స్టార్ట్ చేశాడు. ఇలా యువతి జడను విచిత్రంగా ఉపయోగించి, ఇతను చేసిన ఈ ప్రయోగం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: నారింజ తింటున్నారా.. అయితే కాస్త ఆగండి.. తొక్క తీసి చూడగా షాకింగ్ సీన్..


‘‘బస్సులో సినిమాలను ఇలాక్కూడా చూడొచ్చన్నమాట’’.., ‘‘తెలిసిన అమ్మాయి కాబట్టి సరిపోయింది.. అదే కొత్తవారైతే చెంప చెల్లుమనేది’’.., ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.., ‘‘అది జడ అనుకున్నావా లేక ఫోన్ స్టాండ్ అనుకున్నావా’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 37 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ధైర్యం ఉన్న వారు మాత్రమే చూడండి.. కొడుకును స్కూల్‌ బస్సు ఎక్కిస్తుండగా.. తల్లికి ఏమైందో చూడండి..

Updated Date - Dec 25 , 2024 | 04:22 PM