Share News

Viral Video: నారింజ తింటున్నారా.. అయితే కాస్త ఆగండి.. తొక్క తీసి చూడగా షాకింగ్ సీన్..

ABN , Publish Date - Dec 24 , 2024 | 07:44 PM

Viral Video: ‘‘మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’’.. అన్న సామెత చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఏది కొనాలన్నా.. ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొందరు ఆహార పదార్థాల తయారీలో అపరిశుభ్రత పాటిస్తుంటే.. ఇంకొందరు..

Viral Video: నారింజ తింటున్నారా.. అయితే కాస్త ఆగండి.. తొక్క తీసి చూడగా షాకింగ్ సీన్..
Worms in oranges viral video

‘‘మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’’.. అన్న సామెత చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఏది కొనాలన్నా.. ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొందరు ఆహార పదార్థాల తయారీలో అపరిశుభ్రత పాటిస్తుంటే.. ఇంకొందరు నాసిరక ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. ఇటీవల నాసిరకమైన, కల్తీకి గురైన ఆహార పదార్థాలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా నారింజ పండుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నారింజ పండు కొన్న మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. పండు తొక్కతీసి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) మార్కెట్ నుంచి నారింజ పండ్లను (Oranges) కొనుక్కుని వచ్చింది. ఇంటికి వచ్చాక వాటిలో ఒకదాన్ని చేతిలోకి తీసుకుని తొక్క తీయడం స్టార్ట్ చేసింది. అయితే తొక్క తీసిన తర్వాత.. తీరా తినబోయే సమయంలో షాకింగ్ సీన్ కనిపించింది.

Viral Video: రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. బయటికి వెళ్లి టీ తాగిన డ్రైవర్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


నారింజ పండులో కదులుతున్న పరుగులు కనిపించాయి. వాటిని చూడగానే ఆమె షాక్ అయింది. పండు పైకి చూసేందుకు మాత్రం నాణ్యతగా కనిపించింది. కానీ ఇలా తొక్క తీసి చూస్తే మాత్రం అందులో ఇలా పురుగులు కనిపించడం (Worms in oranges) అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ధైర్యం ఉన్న వారు మాత్రమే చూడండి.. కొడుకును స్కూల్‌ బస్సు ఎక్కిస్తుండగా.. తల్లికి ఏమైందో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నారింజ పండే కాదు.. ఏ పండు అయినా పరిశీలించిన తర్వాతే తినాలి’’.. అంటూ కొందరు, ‘‘పుల్లని పండ్లలో పురుగులు ఉండడానికి ఆస్కారం లేదు.. చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18వేలకు పైగా లైక్‌లు, 2.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నవ్వుతూ పోవడమంటే ఇదేనేమో.. స్టేజీపై డాన్స్ చేస్తున్న యువతి.. అంతలోనే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2024 | 07:44 PM