Share News

Viral Video: చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా.. పామును ఎలా పట్టేసిందో చూడండి..

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:19 AM

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో పరాచకాలు ఆడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటే.. మరికొందరు జనావాసాల్లో సంచరించే ప్రమాదకర పాములను సైతం ఎంతో సులభంగా పట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు..

Viral Video: చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా.. పామును ఎలా పట్టేసిందో చూడండి..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో పరాచకాలు ఆడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటే.. మరికొందరు జనావాసాల్లో సంచరించే ప్రమాదకర పాములను సైతం ఎంతో సులభంగా పట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు మహిళలు కూడా పాములను ధైర్యంగా పట్టుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చీర కట్టుకున్న ఓ మహిళ.. పామును పట్టుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి నాగుపాము (Cobra) ప్రవేశించడంతో అంతా బయటికి పరుగులు తీశారు. చివరకు స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందించగా.. ఓ మహిళ అక్కడికి వచ్చింది. చీర కట్టుకున్న ఆమె.. చేతిలో స్టిక్ పట్టుకుని పామును పట్టేందుకు ప్రయత్నించింది. అక్కడున్న చెక్క పలకలను తీసి పక్కకు పడేసింది.

Viral Video: ఇదేం విన్యాసంరా బాబోయ్.. మూర్ఖత్వానికి పరాకష్ట అంటే ఇదేనేమో..


చివరగా ఓ మూలన దాక్కున్న పామును ఎంతో (woman Caught cobra) చాకచక్యంగా పట్టేసుకుంది. దాని తోక పట్టుకుని అక్కడి నుంచి పక్కకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో పాము ఆమెను కాటేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె మాత్రం ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ దాన్ని చివరకు ప్లాస్టిక్ డబ్బాలో బంధించింది. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి, పంట పొలాల్లో వదిలేసింది.

Viral Video: కెమెరాను ఎత్తుకెళ్లిన సింహం.. రికార్డైన వీడియో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఇలా ఈ మహిళ చీర కట్టులో వచ్చి, పామును సులభంగా పట్టుకుని.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెను చూసి పాము కూడా ప్లాట్ అయిపోయినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా లైక్‌లు, 25.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా.. దేవుడి ఎదురుగా నిలబడి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2024 | 11:19 AM