Viral Video: ధైర్యం ఉన్న వారు మాత్రమే చూడండి.. కొడుకును స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా.. తల్లికి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:56 PM
ప్రమాదం ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విషాధ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ప్రమాదం ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విషాధ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్నాటక (Karnataka) కలబురగిలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు స్థానిక మోహన్ లాడ్జి వద్దకు వచ్చింది. ఇంతలో సదరు స్కూల్ బస్సు కూడా అక్కడికి వచ్చి ఆగింది. అయితే పిల్లాడిని బస్సు ఎక్కించే క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
విద్యుత్ లైన్లు తెగి బస్సు మీద పడ్డాయి. దీంతో మహిళ ఒక్కసారిగా (woman was electrocuted) విద్యుదాఘాతానికి గురైంది. చూస్తుండగానే తల్లీ కొడుకు విద్యుత్ షాక్‌తో కిందపడి గిలాగిలా కొట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే విద్యుత్ లైన్లు పడిపోయి ఉండడంతో వారి వల్ల సాధ్యం కాలేదు. ఇలా చాలా సేపటి తర్వాత ఎలాగోలా తల్లీకొడుకును కాపాడి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో తల్లికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. అయితే స్కూల్ బస్సులో ఉన్న 11 మంది పిల్లలకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: నవ్వుతూ పోవడమంటే ఇదేనేమో.. స్టేజీపై డాన్స్ చేస్తున్న యువతి.. అంతలోనే..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..