Viral Video: నవ్వుతూ పోవడమంటే ఇదేనేమో.. స్టేజీపై డాన్స్ చేస్తున్న యువతి.. అంతలోనే..
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:51 PM
చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరు బతుకుపై ఆశలు వదులుకున్న సమయంలో ఆశ్చర్యకరంగా ప్రాణాలతో తిరిగి వస్తుంటే.. మరికొందరు అప్పటిదాకా నవ్వుతూ ఉండి.. అంతలోనే మృత్యుఒడి లోకి జారుకుంటుంటారు. ఇటీవల ఇలాంటి మరణాలు పెరిగిపోవడాన్ని చూస్తున్నాం. నడుస్తున్నవారు నడుస్తున్నట్లుగా..
చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరు బతుకుపై ఆశలు వదులుకున్న సమయంలో ఆశ్చర్యకరంగా ప్రాణాలతో తిరిగి వస్తుంటే.. మరికొందరు అప్పటిదాకా నవ్వుతూ ఉండి.. అంతలోనే మృత్యుఒడి లోకి జారుకుంటుంటారు. ఇటీవల ఇలాంటి మరణాలు పెరిగిపోవడాన్ని చూస్తున్నాం. నడుస్తున్నవారు నడుస్తున్నట్లుగా, కూర్చున్నవారు కూర్చున్నట్లు చనిపోతుంటారు. తాజాగా, ఓ యువతి మృతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అప్పటిదాకా సంతోషంగా డాన్స్ చేస్తున్న యువతి.. సడన్‌గా కిందపడి చనిపోయింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘నవ్వుతూ పోవడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇటీవల చాలా మంది యువకులు గుండెపోటుతో (heart attack) హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. కుర్చీలో కూర్చున్న వారు, నడుస్తున్న వారు, స్నేహితులతో మాట్లాడుతున్న వారు.. ఉన్నట్లుండి కిందపడిపోయిన చనిపోయే విషాద ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఓ యువతి విషయంలోనే ఇలాగే జరిగింది.
ఓ కార్యక్రమంలో వేదికపై ఓ యువతి డాన్స్ చేస్తోంది. నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్న ఆమెను చూసి అంతా ఈలలు వేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఇలా ఆమె సంతోషంగా డాన్స్ చేస్తున్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా నవ్వుతూ డాన్స్ చేస్తున్న యువతి.. ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడిపోయింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరుగెత్తుకుంటూ వేదిక పైకి వెళ్లి ఆమెను పరామర్శించారు. అయితే అప్పటికే (young woman died while dancing) ఆమె ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగానే యువతి చనిపోయినట్లు చెబుతున్నారు.
Viral Video: రైతు కొంప ముంచిన రైలు.. ఈ ప్రయాణికులు చేసిన పని చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఇలా జరగడం చాలా బాధాకరం’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. లక్షకు పైగా లైక్‌లు, 5.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..