Share News

Viral Video: కోతికే చక్కిలిగింతలు పెట్టిన యువతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 20 , 2024 | 07:47 PM

కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొన్నిసార్లు కోతి చేష్టలు చేసి అందరినీ నవ్విస్తే.. మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇక వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...

Viral Video: కోతికే చక్కిలిగింతలు పెట్టిన యువతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొన్నిసార్లు కోతి చేష్టలు చేసి అందరినీ నవ్విస్తే.. మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇక వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి కోతికే చక్కిలిగింతలు పెట్టింది. చివరకు కోతి చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని కోతులు చెట్టు కింద కూర్చుని ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువతి (young woman) వెళ్లి వాటి పక్కనే కూర్చుంటుంది. అంతటితో ఆగని ఆమె.. ఓ కోతిని పదే పదే కెలికి మరీ ఇబ్బంది పెడుతుంది. ముందుగా కోతి వీపుపై తట్టిగా తడుతుంది. దీంతో కోతికి చిర్రెత్తుకొస్తుంది. ‘‘ఏంటమ్మా.. నువ్వూ... నా పాటికి నేనుంటే ఇబ్బంది పెడుతున్నావ్’’.. అంటూ చేయి పక్కకు తీసి, కోపంగా చూస్తూ హెచ్చరిస్తుంది.

Viral Video: వామ్మో.. ఈమె ఫోన్ ఏంటీ విచిత్రంగా ఉందే.. వెనుక వైపు తీక్షణంగా చూడగా షాకింగ్ సీన్..


అయినా ఆమె మళ్లీ కోతి చేయిని లాగి తమాషా చేస్తుంది. దీంతో కోతికి కోపం వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మరోసారి (monkey expressed anger on young woman) కోపంగా చూస్తూ హెచ్చరిస్తుంది. అయినా ఆ యువతి మాత్రం ఏమాత్రం తగ్గదు. దూరంగా కూర్చున్న కోతిని మళ్లీ పదే పదే తాకుతూ ఉంటుంది. ఈ క్రమంలో కోతికి చక్కిలిగింతలు కూడా పెడుతుంది. దీంతో కోతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నన్ను ఇబ్బంది పెడతావా.. ఉండు నీ పని చెబుతా’’.. అన్నట్లుగా ఆమె భుజంపైకి దూకి జుట్టు పీకేంత పని చేస్తుంది. కానీ ఆమెకు ఎలాంటి హానీ చేయదు.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


ఇంకో కోతి.. ‘‘మీరూ మీరూ ఎలాగైనా గొడవపడండి.. నాకేం సంబంధం లేదు’’.. అన్నట్లుగా ఆమె పక్క నుంచే వెళ్లిపోతుంది. మరో కోతి ఆమె ఎదురుగా కూర్చుని వీరి తమాషా ఫైట్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. ఇలా కోతి, యువతి మధ్య జరిగిన తమాషా సంఘటన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ చెప్పలేరు.. కాబట్టి ఇళాంటి పనులు చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 07:47 PM