Share News

Viral video: వధువు ముందు వరుడి గాలి తీసిన వ్యక్తి.. డాన్స్ చేస్తుండగా.. అతడు చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Jun 20 , 2024 | 09:01 PM

వివాహాల సమయంలో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం రోజూ చూస్తూనే ఉంటాం. వివాహ కార్యక్రమాల్లో ఇలా ఘటన జరగ్గానే.. అలా నెట్టింట్లోకి వచ్చి పడుతుంటుంది. వాటిలో కొన్ని నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా..

Viral video: వధువు ముందు వరుడి గాలి తీసిన వ్యక్తి.. డాన్స్ చేస్తుండగా.. అతడు చేసిన నిర్వాకం..

వివాహాల సమయంలో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం రోజూ చూస్తూనే ఉంటాం. వివాహ కార్యక్రమాల్లో ఇలా ఘటన జరగ్గానే.. అలా నెట్టింట్లోకి వచ్చి పడుతుంటుంది. వాటిలో కొన్ని నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వివాహ సమయంలో వధూవరులు డాన్స్ చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్యలో ఎంటరైన ఓ వ్యక్తి చివరకు వరుడి గాలి తీసేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఊరేగింపు సమయంలో బంధువులంతా వధూవరులను డాన్స్ చేయాలంటూ పట్టుబడతారు. దీంతో చివరకు వారిద్దరూ (Bride and groom dance) డాన్స్ చేసేందుకు సిద్ధమవుతారు. ఒకరికి మించి మరొకరు పోటాపోటీగా డాన్స్ చేస్తుంటారు. వారి డాన్స్ చూసి చుట్టూ ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. పక్కన ఉన్న ఓ వ్యక్తి వరుడి తలపాగాను పక్కకు లాగేస్తాడు. దీంతో (groom bald head) వరుడి బట్టతల బయటపడుతుంది.

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..


బట్టతల బయటపడడంతో వరుడు ఉన్నట్టుండి షాక్ అవుతాడు. వెంటనే ఆ వ్యక్తి చేతిలో ఉన్న తలపాగాను లాక్కుని మళ్లీ తలపై పెట్టుకుంటాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. వధువు తల కిందకు దించుకుని డాన్స్ చేస్తుండడంతో ఈ విషయాన్ని గమనించదు. వధువు చూసేలోగానే వరుడు తలపాగాను లాక్కుని మళ్లీ పెట్టుకుంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘మొత్తానికి వరుడి గాలి తీసేశారుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకున్నాడో ఏమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..

Updated Date - Jun 20 , 2024 | 09:01 PM