Share News

Viral video: ఒళ్లుగగుర్పొడిచే సీన్.. వామ్మో.. ఇంతకీ ఇది నిజమేనా..! వీళ్లు చేసిన విన్యాసం చూస్తే..

ABN , Publish Date - Jun 19 , 2024 | 09:23 PM

చాలా మంది చాలా రకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొందరు చేసే విన్యాసాలు అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. మరికొందరు చేసే విన్యాసాలు అనితర సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఇంకొందరు..

Viral video: ఒళ్లుగగుర్పొడిచే సీన్.. వామ్మో.. ఇంతకీ ఇది నిజమేనా..! వీళ్లు చేసిన విన్యాసం చూస్తే..

చాలా మంది చాలా రకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొందరు చేసే విన్యాసాలు అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. మరికొందరు చేసే విన్యాసాలు అనితర సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ‘‘అరే..! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా స్టంట్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇంతకీ ఇది నిజమేనా..!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులఅు రోడ్డు పక్కన విన్యాసాలు (stunts) చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసిన ఓ ప్రమాదకర విన్యాసం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వారిలో ఓ వ్యక్తి నోట్లో ఇనుప వస్తువు పెట్టుకున్నాడు. అలాగే ఇంకొ వ్యక్తి కూడా తన నోటిలో అలాంటి ఇనుప వస్తువునే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఇంకో వ్యక్తిని తన తలపై తలకిందులాగా ఎత్తుకున్నాడు.

Viral video: జలకాలాటల్లోనూ ఇవేం పాడు పనులు.. ప్రేయసిని పైకి ఎత్తుకుని ఇతను చేసిన నిర్వాకం..


చివరకు ఇద్దరూ కలిసి వారి నోటిలో ఉన్న ఇనుప వస్తువుపై నిలబడి బ్యాలెన్స్ చేశారు. అంతటిలో ఆగకుండా నేలపై నిలబడిన వ్యక్తి.. పైన ఉన్న వ్యక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ వారు మాత్రం ఇనుప వస్తువుపై ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Viral video: ఎడారిలో చిక్కుకున్న ప్రేమజంట.. ప్రియురాలిని కాపాడేందుకు ప్రియుడు తీసుకున్న నిర్ణయంతో.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ విన్యాసం చూస్తుంటనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంతకీ ఇది నిజమేనా.. అలా చేయడం ఎలా సాధ్యం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 54 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Jun 19 , 2024 | 09:23 PM