Share News

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..

ABN , Publish Date - Jun 20 , 2024 | 06:01 PM

కొన్నిసార్లు అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇళ్లల్లో మహిళలు ఒంటరిగా ఉన్న సమయాల్లో...

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..

కొన్నిసార్లు అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇళ్లల్లో మహిళలు ఒంటరిగా ఉన్న సమయాల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడం చూశాం. సడన్‌గా పైకప్పు కూలడం, బయటికి నుంచి వాహనాలు, జంతువులు లోపలికి చొచ్చుకురావడం తదితర ఘటనలు జరగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఓ మహిళ తన పిల్లాడిని ఊయలలో వేసి ఊపుతుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) తన పిల్లాడితో సహా ఊయలలో పడుకుని ఊగుతుంటుంది. అయితే పిల్లాడు ఏడుస్తుండడంతో చివరకు తాను కిందకు దిగి ఊయలను వేగంగా ఊపుతుంటుంది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే ఓ పెద్ద పాము (snake) ఊయల సమీపానికి వచ్చి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. చివరకు ఊయల సమీపానికి వస్తుంది.

Viral video: పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్లుంది.. చెట్టుపై ఈ యువతి చేస్తున్న పని చూస్తే.. షాకవ్వాల్సిందే..


తీరా తగ్గరికి వచ్చే క్రమంలో మహిళ పామును గమనిస్తుంది. వెంటనే భయంతో పైకి లేచి, పిల్లాడిని ఎత్తుకుని అక్కడి నుంచి (mother saving baby) దూరంగా పారిపోతుంది. సమాయానికి ఆమె స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటనే ఒల్లు జలదరిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రైలు దిగే సమయంలో ఇలాంటి తప్పు ఎవరూ చేయొద్దు.. ఇతడు చేసిన పని చూడండి..

Updated Date - Jun 20 , 2024 | 06:01 PM