Share News

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబోయ్.. పాముతో కాకి ఫైట్.. చివరికిలా..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:55 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో గానీ.. ఓ నాగుపాముకు, కాకికి మధ్య ఉన్నట్టుండి ఫైట్ మొదలువుతుంది. కాకిని కాటేసి చంపేయాలని పాము, ఎలాగైనా పామును ఫినిష్ చేయాలని కాకి తీవ్రంగా శ్రమించాయి. ఈ గొడవలో..

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబోయ్.. పాముతో కాకి ఫైట్.. చివరికిలా..!

పాము, ముంగిస మధ్య ఫైట్ జరగడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో చాలాసార్లు ముంగిసలే పైచేయి సాధిస్తుంటాయి. అలాగే పాముతో గద్దలు, డేగలు, రాబందులతో పాటూ కోతులు, కుక్కలు కూడా ఫైట్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పాముతో ఫైట్ చేసిన కాకి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో గానీ.. ఓ నాగుపాముకు, కాకికి మధ్య ఉన్నట్టుండి ఫైట్ మొదలువుతుంది. కాకిని కాటేసి చంపేయాలని పాము, ఎలాగైనా పామును ఫినిష్ చేయాలని కాకి తీవ్రంగా శ్రమించాయి. ఈ గొడవలో (crow attacked snake) చివరకు కాకి తన పవర్ చూపించింది.

Viral Video: ఒట్టి చేతులతో కొండచిలువను పట్టేందుకు యువతి ప్రయత్నం.. అయితే చివరకు..


కాకి పదే పదే ముక్కుతో పొడవడంతో పాము తీవ్రంగా గాయపడింది. దీంతో చివరకు మెల్లగా పాక్కుంటూ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసింది. అయినా కాకి మాత్రం పామును వదల్లేదు. చివరకు పాము తలపై వాలి, కాళ్లతో తలను తొక్కిపట్టుకుంది. దీంతో పాము నోరు తెరచి కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాకి పాము నోటికి తన ముక్కు పెట్టి మరీ నాలుకను పీకేసింది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇలా పాము పామును తలపై పొడిచి పొడిచి తీవ్రంగా గాయపరచింది. పరిస్థితి చూస్తుంటే ఈ దాడిలో పాము చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘పాముకు చుక్కలు చూపించిన కాకి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కోతి చేష్టలు చేస్తున్న పక్షులు.. వ్యక్తి భోజనం చేస్తుంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 06:02 PM