Share News

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్నా కారు దిగని వ్యక్తులు.. కాపాడాలని జనం ప్రయత్నం.. చివరకు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:40 PM

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభివిస్తోంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక..

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్నా కారు దిగని వ్యక్తులు.. కాపాడాలని జనం ప్రయత్నం.. చివరకు..

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభివిస్తోంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు కాలువలో కొట్టుకుపోతున్నా కూడా కారు దిగి బయటికి రాలేదు. అతన్ని కాపాడేందుకు అంతా పరుగులు పెట్టారు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పూణేలో (Pune) చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తు్న్నాయి. ఈ క్రమంలో పూణే పరిధి పింప్రి చించ్వాడ్‌లోని చర్హోలీ బుద్రుక్ ప్రాంత సమీపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన డ్రైవర్‌తో సహా కారులో వెళ్తుండగా.. (car floating in a river) ప్రమాదశాత్తు కారు నదిలోకి దూసుకెళ్లింది.

Viral Video: రోడ్డు మధ్యలో మహిళ వింత నిర్వాకం.. తాంత్రిక పూజలు చేస్తూ.. అంతా చూస్తుండగానే..


కారు నీటిలో కొట్టుకుపోతుండడంతో లోపల ఉన్న ఇద్దరూ అద్దాలు వేసుకుని భయం భయంగా అలాగే కూర్చున్నారు. కాసేపటికి కారు కొట్టుకుపోవడం చూసి చుట్టుపక్కల వారంతా అక్కడ గుమికూడారు. కారులోని వారిని బయటికి రమ్మంటూ అంతా కేకలు పెట్టారు. వారు అలా ఎంత సేపు పిలిచినా కారులో ఉన్న వారు మాత్రం కారు దిగి బయటికి రాలేదు. ఇంతలో కారు మరికొంత దూరం కొట్టుకెళ్లి ఓ బ్రిడ్జి వద్ద ఆగింది. అయితే చివరకు జనం ఎలాగోలా అక్కదడికి చేరుకుని కారులోని వారిని బయటికి లాగేశారు. చివరకు యజమానికి డ్రైవర్ సయాంతో లాక్కుంటూ బలవంతంగా బయటికి తీసుకెళ్లారు.

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. ‘‘ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడి మంచిపని చేశారు’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలకు తెగించి వీళ్లు చేసిన సాయం ఎంతో గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొదంరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని.. చివరకు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఇలా..

Updated Date - Jul 27 , 2024 | 06:40 PM