Share News

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:23 PM

చిన్న పిల్లలు కొన్నిసార్లు కోతి చేష్టలు చేస్తూ అందరినీ చిరాకు తెప్పిస్తుంటారు. మరికొన్నిసార్లు తెగ నవ్విస్తుంటారు. చాలా మంది పిల్లలు ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ...

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..

చిన్న పిల్లలు కొన్నిసార్లు కోతి చేష్టలు చేస్తూ అందరినీ చిరాకు తెప్పిస్తుంటారు. మరికొన్నిసార్లు తెగ నవ్విస్తుంటారు. చాలా మంది పిల్లలు ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే అదే చిన్న పిల్లాడు కోతితో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు, కోతి జుట్టు జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకున్నారు. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడికి కోతికి మధ్య ఉన్నట్టుండి తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. కోతి వద్దకు వెళ్లిన బాలుడు.. దాన్ని కెలికి మరీ కొట్టాట మొదలెట్టాడు. దీంతో ఆగ్రహించిన కోతి పిల్లాడి (fight between monkey and child) జుట్టు పట్టుకుని మరీ దాడి చేసేందుకు ప్రయత్నించింది.

Viral Video: అనవసరంగా కోతితో పెట్టుకుందే.. చివరకు పులి పరిస్థితి చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


అయితే ఆ బాలుడు కూడా ఏమాత్రం తగ్గకుండా కోతి జుట్టు పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ కోతిని విసిరికొట్టాడు. కోతి కూడా వెనక్కు తగ్గకుండా బాలుడిని ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా వారి మధ్య చాలా సేపు ఫైట్ నడిచింది. చివరకు అలసిపోయిన కోతి.. ‘‘వీడితో కొట్టాడటం కంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బెటర్’’.. అని అనుకున్నట్లుగా ఒక్కసారిగా ఫైట్ నుంచి తప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని.. చివరకు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఇలా..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఫన్నీ ఫైట్ చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలీదు.. జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 27 , 2024 | 04:23 PM