Share News

Viral video: అరెరే.. ఇలా జరిగిందేంటీ.. దంపతులు రిక్షాలో కూర్చోగానే.. నడుపుదామని చూస్తే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 08:16 PM

ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమాల్లో చూసే ..

Viral video: అరెరే.. ఇలా జరిగిందేంటీ.. దంపతులు రిక్షాలో కూర్చోగానే.. నడుపుదామని చూస్తే..

ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమాల్లో చూసే కామెడీ సీన్లకు మించిన ఘటనలు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దంపతులు రిక్షాలో కూర్చోగానే సదరు వ్యక్తి నడుపుదామని చూడగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న రిక్షా వద్దకు ఓ జంట (couple) వస్తుంది. తాము వెళ్లాల్సిన ప్రాంతం పేరు చెప్పి రిక్షాలో కూర్చుంటారు. ముందుగా భార్య రిక్షాలో కూర్చోగా.. తర్వాత భర్త కూడా కూర్చుంటాడు. వాళ్లిద్దరూ కూర్చోగానే రిక్షా పుల్లర్ (rickshaw puller) కవర్ మూసేస్తాడు. రిక్షా నడుపుదామని చూసేలోగానే ఒక్కసారిగా వెనక్కు పడిపోతుంది. దంపతులు బరువు ఎక్కువగా ఉండడంతో రిక్షా బ్యాలెన్స్ తప్పి వెనక్కు పడుతుంది. దీంతో రిక్షాపుల్లర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Viral video: నిధి కోసం వెతుకుతుండగా బయటపడ్డ సంచి.. సడన్‌గా లోపలి నుంచి దూసుకొచ్చిన పాము.. చివరకు..


దంపతులను బయటికి తీసే క్రమంలో కంగారుపడుతుంటాడు. తర్వాత చుట్టు పక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి సాయం చేస్తారు. ఎట్టకేలకు కిందపడ్డ దంపతులు రిక్షా నుంచి బయటికి వస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరెరే.. ఈ రిక్షాపుల్లర్‌కు ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘రిక్షా ప్రయాణాల్లో ఇలాంటివి మామూలే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 64వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 15 , 2024 | 08:18 PM