Share News

Viral Video: ఇలాంటి చేపలను ఎప్పుడైనా చూశారా.. సముద్ర గర్భంలో ఎలా నడుస్తున్నాయో చూస్తే..

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:48 PM

తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.. అని ఓ సినీ కవి అన్న చందంగా.. మనకు తెలీకుండా ఎన్నో వింతలు, విశేషాలు ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఇలాంటి చేపలను ఎప్పుడైనా చూశారా.. సముద్ర గర్భంలో ఎలా నడుస్తున్నాయో చూస్తే..

తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.. అని ఓ సినీ కవి అన్న చందంగా.. మనకు తెలీకుండా ఎన్నో వింతలు, విశేషాలు ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వింత చేపలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా చేపలు ఈదుతాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈదడంతో పాటూ నడిచే చేపలు కూడా ఉన్నాయి. సముద్ర గర్భంలో కాళ్లతో నడుస్తున్న చేపలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో నడిచే చేపలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ పోస్ట్‌ డాక్టోరల్ ఫెలో అయిన కోరీ అలార్డ్.. ఈ నడిచే చేపల గురించి ప్రపంచానికి తెలియజేశారు. 2019లో కేప్ కాడ్ యొక్క మెరైన్ బయోలాజికల్ లాబొరేటరీని సందర్శించిన సమయంలో ఆయన ఈ వింత చేపలను చూశాడు. సీ రాబిన్ గా పిలిచే ఈ చేపలకు ముందు రెండు వైపులా కలిపి మొత్తం ఆరు కాళ్లు ఉన్నాయి. ఈ చేపలను చూడగానే కోరీ అలార్డ్.. వాటిపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాడు. సముద్ర గర్భంలో కొన్నేళ్ల పాటు పరిశోధనల అనంతరం ఆ చేపలకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నారు.

Viral Video: వామ్మో.. ఇది మాయా.. లేక మంత్రమా.. వైట్ పేపర్లను ఇతనెలా మారుస్తున్నాడో చూస్తే..


ఈ సీ రాబిన్ చేపలకు (Sea Robins Fish) పీతల తరహాలో మొత్తం ఆరు కాళ్లు ఉన్నాయి. ఈ కాళ్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నట్లు గుర్తించారు. రాబిన్ చేపల కాళ్లు సెన్స్ ఆర్గాన్‌లా పని చేస్తున్నట్లు గుర్తించారు. సముద్ర అడుగు భాగంలో నడవడంతో పాటూ ఇసుక కింద ఉన్న ఆహారాన్ని కూడా ఈ కాళ్ల సాయంతో గుర్తించగలుగుతాయి. ఆహారాన్ని గుర్తించిన వెంటనే తమ కాళ్ల సాయంతో వాటిని తవ్వి బయటికి తీయగలవు. ఈ చేపలు తమ కాళ్ల సాయంతో ఆహారాన్ని గుర్తించడమే కాకుండా వాటి రుచిని కూడా తెలుసుకోగలవని కోరీ బృందం తెలిపింది.

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. కారు ఇంజిన్‌లో ఇలాంటి సీన్.. నెవర్ బిఫోన్.. ఎవర్ ఆఫ్టర్..


అదేవిధంగా మట్టి అడుగున అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న చిన్న చిన్న జీవుల జాడను కూడా ఈ రాబిన్ చేపలు తమ ఆరు కాళ్లతో (Six legged fish) గుర్తించగలవు. మనుషులకు ఎలాగైతే నాలుక మీద రుచి మొగ్గలు ఉంటాయో.. అచ్చం అలాగే ఈ చేపల కాళ్లలో బొడిపెలు ఉంటాయని, వాటి సాయంతో ఆహార జాడను కనుక్కుంటాయని అధ్యయనంలో వెళ్లడైంది. కాగా, కాళ్లతో నడిచే ఈ రాబిన్ చేపలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 05:48 PM