Share News

Viral Video: పిసినారి పని చేసినా వరుడిని వదలని మరదలు.. వేదికపైకి వెళ్లి మరీ..

ABN , Publish Date - Dec 07 , 2024 | 07:21 PM

వివాహ కార్యక్రమాల్లో ఇటీవల సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు స్ర్కిప్ట్ రాసుకుని మరీ అనేక వీడియోలను ప్లాన్ చేస్తున్నారు. అయినా కూడా ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వధూవరులను..

Viral Video: పిసినారి పని చేసినా వరుడిని వదలని మరదలు.. వేదికపైకి వెళ్లి మరీ..

వివాహ కార్యక్రమాల్లో ఇటీవల సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు స్ర్కిప్ట్ రాసుకుని మరీ అనేక వీడియోలను ప్లాన్ చేస్తున్నారు. అయినా కూడా ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వధూవరులను స్నేహితులు ఆటపట్టించడం, వరుడిని వధువు.. వధువును వరుడు ఫూల్ చేయడం చూస్తుంటాం. తాజాగా, వరుడికి షాకిచ్చిన మరదలి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వరుడు చేసిన పిసినారి పనికి.. చివరకు మరదలు అతడికి షాక్ ఇచ్చింది. ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరుడికి, అతడి మరదలికి మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా వివాహ కార్యక్రమాల్లో వరుడికి వరసయ్యే అమ్మాయిలు.. చెప్పులు దాచి పెట్టడం, తర్వాత డబ్బులు డిమాండ్ చేసి వాటిని తిరిగివ్వడం చేస్తుంటారు. వారికి తన చెప్పులు దొరక్కుండా వరుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటాడు.

Viral Video: పర్వతం పైకి బల్లిలా పాకుతూ వెళ్లాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వరుడు.. ఎక్కడ తన బూట్లను చోరీ చేస్తారో అని భయపడి, చివరకు పాత చెప్పులు ధరించి వేదిక పైకి వస్తాడు. వరుడి చెప్పులు చోరీ చేసేందుకు అతడి మరదలు వేచి చూస్తూ ఉంటుంది. చివరకు వేదిక పైకి వెళ్లిన ఆమె.. మెల్లగా వరుడి వద్దకు వెళ్లి (sisterinlaw stolen groom slippers) అతడి చెప్పులను లాక్కుని పారిపోతుంది. పాత చెప్పులను కూడా వదలకుండా ఎత్తుకెళ్లడంతో వరుడు షాక్ అవుతాడు. ఆమె చేసిన నిర్వాకానికి వధువు కూడా నవ్వుకుంటుంది. పక్కన ఉన్న బంధువులంతా ఎంజాయ్ చేయడం వీడియోలో చూడొచ్చు.

Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి షాక్ ఇచ్చిన మరదలు’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి అన్నాక ఇలాంటి సరదా సంఘటనలు ఉంటేనే బాగుంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఛీ.. ఇలాకూడా స్నానం చేస్తారా.. ఈ బాత్రూం కట్టినోడు కనపడితే వెంటపడి కొడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 07 , 2024 | 07:21 PM