Share News

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 15 , 2024 | 01:33 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వినాయకుడి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది మహిళలు ఆలయంలో భజనలు చేస్తుంటారు. కొందరు కుర్చీల్లో కూర్చుని ఉండగా.. మరికొందరు నేలపై కూర్చుని భజనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కిటికీ పక్కన కూర్చున్న మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది..

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..

ఇంటి నుంచి బయటికి వెళ్తే.. అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఇవి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందే.. ఎలాంటి నష్టం జరుగుతుందో కూడా చెప్పలేం. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు మహిళలు గుడిలో భజనలు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కిటికీ పక్కన కూర్చున్న మహిళకు ఎలాంటి అనుభవం ఎదురైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) శంకర్ నగర్ ప్రాంతంలోని వినాయకుడి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది మహిళలు (Women performing bhajans) ఆలయంలో భజనలు చేస్తుంటారు. కొందరు కుర్చీల్లో కూర్చుని ఉండగా.. మరికొందరు నేలపై కూర్చుని భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తుంటారు.

Viral Video: లో బడ్జెట్ సీసీ కెమెరా.. ఈ వ్యాపారి తెలివితేటలు మామూలుగా లేవుగా..


అయితే ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కిటికీ పక్కన కూర్చునన్ మహిళ ఫోన్ చూసుకుంటూ పరధ్యానంలో ఉంటుంది. ఆ సమయంలో సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే కిటికీ పక్కన ఉన్న ఓ దొంగ.. ఆమెను గమనిస్తున్నాడు. అదును చూసి కిటికీలోంచి చేయి లోపలికి పెట్టి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు. ఊహించని ఈ ఘటనలో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడ కాసేపు గందరగోళన వాతావరణం నెలకొంది. అయితే ఆలోపే ఆ దొంగ చైన్‌తో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

Viral Video: బైకుపై మందుబాబు.. మార్గమధ్యలో అతడి తిప్పలు చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఘటన చూస్తుంటే కిటికీ పక్కన కూర్చోవాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 1.90 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టపాసులు పేల్చి వైరల్ అవ్వాలని చూశాడు.. చివరికి ఇలా అవుతుందని ఊహించలేకపోయాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 01:33 PM