Share News

Viral video: ఎడారిలో చిక్కుకున్న ప్రేమజంట.. ప్రియురాలిని కాపాడేందుకు ప్రియుడు తీసుకున్న నిర్ణయంతో.. చివరకు..

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:33 PM

ట్రెక్కింగ్, స్కేటింగ్, బోటింగ్‌ తదితర పనులు చేసే క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు ఇలాంటి సమయాల్లో చేసే సాహసాలు చివరకు వారిని చిక్కుల్లో పడేస్తుంటాయి. అయితే...

Viral video: ఎడారిలో చిక్కుకున్న ప్రేమజంట.. ప్రియురాలిని కాపాడేందుకు ప్రియుడు తీసుకున్న నిర్ణయంతో.. చివరకు..

ట్రెక్కింగ్, స్కేటింగ్, బోటింగ్‌ తదితర పనులు చేసే క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు ఇలాంటి సమయాల్లో చేసే సాహసాలు చివరకు వారిని చిక్కుల్లో పడేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తు ప్రమాదాల నుంచి లక్కీగా బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడగియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ ప్రేమ జంట ఎడారిలో చిక్కుకుపోయింది. చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ప్రియురాలు ప్రాణం కాపాడేందుకు ప్రియుడు సాహసం చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కాలిఫోర్నియాకు (Southern California) చెందిన ఓ ప్రేమ జంట (lovers) ట్రెక్కింగ్ వెళ్లి.. స్థానిక జాషువా ట్రీ నేషనల్ పార్క్ ఎడారిలో (desert) చిక్కుకుపోయింది. ఎడారిలో ఎటు వెళ్లాలో అర్థం కాక చివరకు ఓ ప్రదేశంలో చిక్కుకుపోయారు. ఎలాగైనా తప్పించుకోవాలనే క్రమంలో వివిధ రకాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న నీళ్లు కూడా అయిపోయాయి.

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..


నీళ్లు అయిపోవడంతో ఓ వైపు దాహం, మరోవైపు ఎండ వేడికి తీవ్ర అవస్థలు పడ్డారు. కాసేపటికి యువతి వడదెబ్బకు (sunstroke) గురై అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ప్రియురాలి ప్రాణాం కాపాడేందుకు ప్రియుడు సాహసం చేశాడు. ఆమెకు ఎండవేడి తగలకుండా పైన పడుకుని సంరక్షించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వారిని గుర్తించి హెలీకాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు.

Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..


ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది వారిద్దరినీ కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కదా నిజమైన ప్రేమంటే’’.. అంటూ కొందరు, ‘‘ప్రియురాలి ప్రాణాలు కాపాడిన ఇతను నిజంగా గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900 పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral video: జలకాటల్లోనూ ఇవేం పాడు పనులు.. ప్రేయసిని పైకి ఎత్తుకుని ఇతను చేసిన నిర్వాకం..

Updated Date - Jun 19 , 2024 | 08:34 PM