Share News

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:59 PM

బీచ్‌కు వెళ్లే యువతీయువకులు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ఇసుకలో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటారు. ఇంకొందరు కేరింతలు కొడుతూ ప్రపంచాన్ని మరచిపోయి సరాదాగా గడుపుతుంటారు. ఇలాంటి..

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

బీచ్‌కు వెళ్లే యువతీయువకులు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ఇసుకలో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటారు. ఇంకొందరు కేరింతలు కొడుతూ ప్రపంచాన్ని మరచిపోయి సరాదాగా గడుపుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి బీచ్‌లో చేసిన విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బీచ్‌లో స్నానం చేస్తూ ఎంజాయ్ చేయాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బీచ్‌లో (young woman in beach) స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే అంతటితో ఆగని ఆమె.. వీడియోల కోసం ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించింది. ఇందుకోసం ఓ స్టీల్ పాత్రను తీసుకొచ్చి ఇసుకలో బోర్లించింది. దాని కింద టపాసులు పేల్చి వీడియో తీసుకోవాలని అనుకుంది. అనుకున్నట్లుగానే గిన్నెను ఇసుకలో బోర్లించి, చేతిలో టపాసులను (firecrackers) వెలిగించి గిన్నె కింద వేసింది. వెంటనే వెనక్కు వెళ్లి నిలబడుతుంది. అయితే ఎంతకీ టపాసులు పేలకపోవడంతో మళ్లీ దగ్గరికి వచ్చి చూడాలని ప్రయత్నిస్తుంది.

Women: ఇంటికి రాగానే ప్రియుడితో కలిసి ఉన్న తల్లి.. చివరకు అతడి నిర్వాకం తెలుసుకున్న కొడుకు..


అయితే తీరా గిన్నె దగ్గరికి వచ్చి చూడాలని ప్రయత్నిచేలోపే ఫట్‌మని పేలుతుంది. పేలుడు దాటికి గిన్నె పైకి ఎగిరి యువతి దవడకు గట్టిగా తాకుతుంది. దెబ్బకు ఆమె ఎగిరి పక్కన పడుతుంది. కుయ్యో మొర్రో.. అని అనుకుంటూ ‘‘అనవసరంగా ప్రయోగం చేశానే’’.. అని పశ్చత్తాపపడుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి ప్రయోగం వికటించింది’’.. అంటూ కొందరు, ‘‘పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే.. ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 18 , 2024 | 04:26 PM