Share News

Viral Video: కళ్ల ముందు జరగబోయే పెద్ద ప్రమాదాన్ని.. ఈ యువతి ఎలా ఆపిందో చూడండి..

ABN , Publish Date - Aug 03 , 2024 | 02:02 PM

కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలకే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా లక్కీగా ఎవరికీ ఏమీ కాదు. అలాగే ఇంకొన్నిసార్లు కొందరి చొరవతో పెద్ద ప్రమాదాలు ఆఖరి నిముషంలో ఆగిపోతుంటాయి. ఇలాంటి...

Viral Video: కళ్ల ముందు జరగబోయే పెద్ద ప్రమాదాన్ని.. ఈ యువతి ఎలా ఆపిందో చూడండి..

కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలకే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా లక్కీగా ఎవరికీ ఏమీ కాదు. అలాగే ఇంకొన్నిసార్లు కొందరి చొరవతో పెద్ద ప్రమాదాలు ఆఖరి నిముషంలో ఆగిపోతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కళ్ల ముందు జరగబోయే పెద్ద ప్రమదాన్ని ఓ యువతి ఎంతో చాకచక్యంగా ఆపేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ప్రధాన రహదారి పక్కన ఓ ట్రక్కు ఆగి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ట్రక్కు పక్కనే ఉన్న ఓ ఎక్సకవేటర్ సమీపంలో ఓ యువతి నడుస్తూ వెళ్తుంటుంది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్ లేకుండానే (truck moves forward without driver) ఉన్నట్టుండి ముందుకు కదులుతుంది.

Viral Video: నీటిలోకి వెళ్లి ఏకంగా మొసలికే ముద్దు పెట్టిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ట్రక్కు నేరుగా రోడ్డుపైపు వెళ్లడం చూసి అక్కడున్న కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి వెనుక వైపు పట్టుకుంటారు. కానీ ట్రక్కును ఆపడం వారి వల్ల కాలేదు. అప్పుడే ట్రక్కు ముందుకు వెళ్లడాన్ని గమనించిన యువతి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి ట్రక్కులోకి ఎక్కింది. వెంటనే బ్రేకు తొక్కడంతో (young women braked and stopped the truck) ఎట్టకేలకు ట్రక్కు ఆగిపోయింది. లేదంటే రోడ్డు పైకి వెళ్లిన ట్రక్కు.. ఏదో ఒక వాహనాన్ని ఢీకొని ఉండేది.

Viral Video: పెళ్లి దుస్తుల్లో ఇదేం పాడు పని.. కెమెరా ఆన్ చేసుకుని మరీ ఈమె చేస్తున్న నిర్వాకం..


సరైన సమయానికి యువతి స్పందించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘పెద్ద ప్రమాదాన్ని ఎంతో చాకచక్యంగా తప్పించింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 91 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై మధ్యలో కూర్చున్న ప్రేమికులు.. సైలెంట్‌గా చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Aug 03 , 2024 | 02:02 PM