Share News

Viral Video: నీటిలోకి వెళ్లి ఏకంగా మొసలికే ముద్దు పెట్టిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:28 PM

మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులపై దాడి చేసే మొసళ్ల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదకర మొసళ్లు కూడా సాధు జంతువుల్లా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి ...

Viral Video: నీటిలోకి వెళ్లి ఏకంగా మొసలికే ముద్దు పెట్టిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులపై దాడి చేసే మొసళ్ల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదకర మొసళ్లు కూడా సాధు జంతువుల్లా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి నీటిలోకి వెళ్లి ఏకంగా మొసలికే ముద్దు పెట్టింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి నీటిలోకి వెళ్లగానే పెద్ద మొసలి బయటికి వచ్చింది. బయటికి రావడమే కాకుండా యువతి వద్దకు వచ్చి నోరు తెరచింది. దీంతో ఆమె మొసలిని దగ్గరికి తీసుకుని తలపై ప్రేమగా (young woman kissed the crocodile) నిమురుతూ ముద్దు పెట్టింది. ఆ తర్వాత తన చేతిలోని ఆహారాన్ని మొసలి నోట్లో విసిరింది.

Viral Video: మానిటర్ బల్లిని కసితీరా కొరికిన నల్ల పాము.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఈ సమయంలో మొసలి కూడా చిన్న పిల్లల్లా మారిపోయింది. యువతి ముద్దు పెడుతున్న సమయంలో ఎంత అమాయకంగా ఉంటూ.. ‘‘తినడానికి నాకోసం ఏమైనా తెచ్చావా’’.. అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. చూస్తుంటే ఆమె మొసళ్ల ట్రైనర్ అని తెలుస్తోంది. పులులు, సింహాలకు ఆహారం అందించే యువతులకు సంబంధించిన వీడియోలను కూడా చాలా చూశాం.

Viral Video: పెళ్లి దుస్తుల్లో ఇదేం పాడు పని.. కెమెరా ఆన్ చేసుకుని మరీ ఈమె చేస్తున్న నిర్వాకం..


అలాగే మొసళ్లతో చనువుగా ప్రవర్తించే మహిళలను కూడా అనేక మందిని చూస్తున్నాం. ఏదేమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ యువతికి చాలా ధైర్యం ఉన్నట్టుందే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే ఇది ఫేక్ వీడియోలాగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వందకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై మధ్యలో కూర్చున్న ప్రేమికులు.. సైలెంట్‌గా చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Aug 03 , 2024 | 01:28 PM