Share News

Viral Video: బతికున్న పీతలను ప్లేటులో వేసుకుని.. ఈ యువతి ఏం చేస్తుందో చూస్తే.. అవాక్కవాల్సిందే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 09:08 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బతికున్న పీతలను ఓ పెద్ద పాత్రలో వేస్తుంది. చూస్తుంటే.. ఆమె వాటితో ఏదో రుచికరమైన వంట చేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా..

Viral Video: బతికున్న పీతలను ప్లేటులో వేసుకుని.. ఈ యువతి ఏం చేస్తుందో చూస్తే.. అవాక్కవాల్సిందే..

ఆహార అలవాట్లు, తినే పద్ధతి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఆహారం తీసుకునే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. చివరకు కొందరు పాములను కూడా తినడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి ఫుడ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బతికున్న పీతలను ప్లేటులో వేసుకుని కరకరా నములుతున్న యవతిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్.. ‘‘వామ్మో.. ఈమేంటీ మరీ వింతగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి బతికున్న పీతలను ఓ పెద్ద పాత్రలో వేస్తుంది. చూస్తుంటే.. ఆమె వాటితో ఏదో రుచికరమైన వంట చేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా చేతిలో ప్లేటును పట్టుకుని అక్కడికి వస్తుంది. ఓ గరిటె తీసుకుని ప్రాణంతో ఉన్న పీతలను ప్లేటులోకి వేసుకుంటుంది. తర్వాత ఒక్కో పీతను చేతిలోకి తీసుకుని, (young woman eating live crabs) నోట్లో పెట్టుకుని కరకరా నమిలేస్తుంది.

Viral Video: వరదల్లో షెడ్డులోకి కొట్టుకొచ్చిన మొసలి.. వెళ్తూ వెళ్తూ ఏం చేసిందో చూడండి..


ఇలా చూస్తుండగానే ప్రాణంతో ఉన్న పీతలన్నింటినీ హాంఫట్ చేసేస్తుంది. ఇలా ప్రాణంతో ఉన్న జీవులను తినడం ఇది కొత్తేం కాదు. మన ప్రాంతంలో చాలా అరుదు కానీ.. చైన, జపాన్ వంటి దేశాల్లో ఇది సర్వసాధారణం. బతికున్న కప్పలను పీక్కుని మరీ తింటుంటారు. అలాగే ఆక్టోపస్‌లను కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని తినడం వల్ల శరీరానికి అధిక కాల్షియం వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. అలాగే ఆసియాలోని కొన్ని దేశాల్లో ఆటవిక జాతులకు చెందిన వారు కోతి మెదడును తినడం ఆనవాయితీ.

Viral Video: బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని చూసిన దొంగ.. ఆ వెంటనే కేకలు పెడుతూ పరుగులు.. అసలేం జరిగిందో చూస్తే..


అదేవిధంగా ఇంకొన్ని ప్రాంతాల్లో పాముతో పకోడీలు చేయడం కూడా చూస్తుంటాం. కాగా, తాజాగా యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మనిషా లేక అడవి మనిషా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం వల్లే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2024 | 09:08 PM