Share News

Viral Video: వేగంగా వెళ్తూ ఉన్నట్టుండి వరుసగా పడిపోయిన బైకర్లు.. కారణమేంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Aug 29 , 2024 | 06:44 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో ఓ హైవే మార్గంలో చాలా మంది బైకర్లు వరుసగా వెళ్తుంటారు. కారులో వెళ్తున్న వారు.. వారికి ముందు వెళ్తున్న బైకర్లను వీడియో తీస్తుంటారు. వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి...

Viral Video: వేగంగా వెళ్తూ ఉన్నట్టుండి వరుసగా పడిపోయిన బైకర్లు.. కారణమేంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

కొన్నిసార్లు చోటుచేసుకునే ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలను చూసినప్పుడు.. ‘‘అరె ఇదేంటీ ఇలాక్కూడా జరుగుందా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వేగంగా వెళ్తున్న బైకర్లు ఒక్కసారిగా ఒకరి తర్వాత ఒకరుగా పడిపోయారు. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకుని అంతా అవాక్కతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో ఓ హైవే మార్గంలో చాలా మంది బైకర్లు వరుసగా వెళ్తుంటారు. కారులో వెళ్తున్న వారు.. వారికి ముందు వెళ్తున్న బైకర్లను వీడియో తీస్తుంటారు. వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. బైకర్లకు ముందు వెళ్తన్న పెద్ద లారీ ఉన్నట్టుండి అదుపు తప్పి యూటర్న్ తీసుకుంటుంది.

Viral Video: వామ్మో.. పూర్తిగా కట్ చేసిన చేపను నీళ్లలోకి వేయగా.. చివరకు ఏమైందో చూడండి..


లారీ యూటర్న్ కాగానే మిగతా వాహనదారులంతా ఒక్కసారిగా భయపడతారు. అయితే బైకర్లలో ముందు వెళ్తున్న వ్యక్తి.. లారీ తనను ఎక్కడ ఢీకొటుందో అనే భయంతో బ్రేకులు వేస్తాడు. దీంతో ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడతాడు. అయితే ఇతడు కింద పడిపోగానే.. అతడి వెనుకే వస్తున్న మిగతా బైకర్లంతా ఇలాగే బ్రేకులు వేసి (bikers felldown on road) టపటపా కిందపడిపోతారు. ఈ ఘటనతో వెనుక కారులో వస్తున్న వారు షాక్ అవుతారు.

Viral Video: గుండెల్ని పిండేసే వీడియో.. గ్రామంలోకి చొరబడ్డ ఏనుగులు.. గ్రామస్తులు నిప్పు పెట్టడంతో చివరకు..


కారులో వెళ్తున్న వారు మొత్తం ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘భయంతోనే ఈ ప్రమాదం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 29 , 2024 | 06:44 PM