Share News

Viral Video: ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:29 PM

సోషల్ మీడియాలో రైల్వేలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. రైలు ప్రయాణంలో కొందరు ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అలాగే రైల్వే గేట్ల వద్ద వాహనదారులు రోడ్డు దాటుకునే సమయంలోనూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే ..

Viral Video: ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో రైల్వేలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. రైలు ప్రయాణంలో కొందరు ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అలాగే రైల్వే గేట్ల వద్ద వాహనదారులు రోడ్డు దాటుకునే సమయంలోనూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. రైల్వే గేట్‌ను వీళ్లు ఆపరేట్ చేసే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఇలాక్కూడా ఆపరేట్ చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని (Bihar) సివాన్ జిల్లాలోని రైల్వే గేట్‌ను ఆపరేట్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేసే ఓ యువకుడు రైల్వే గేటు వద్ద నిలబడి, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారో అందరికీ వివరిస్తుంటాడు. అప్పటికి ఆ రైల్వే గేటు (Railway gate) మూసి ఉంటుంది. ఇంతలో ఓ ట్రైన్ వచ్చి గేటు దాటి కాస్త ముందుకు వెళ్లి ఆగుతుంది.

Viral Video: చిరుతపులితో దొంగా పోలీస్ ఆట.. ఈ కోతి టాలెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సిబ్బంది రైల్లో నుంచి కిందకు దిగి నడుచుకుంటూ గేటు వద్దకు వస్తాడు. తన వద్ద ఉన్న ఇనుప రాడ్ సాయంతో గేటును తెరుస్తాడు. ఆ తర్వాత మళ్లీ వెళ్లి ట్రైన్ ఎక్కి వెళ్లిపోతాడు. సాధారణంగా రైల్వే గేటు వద్దే ఓ గదిలో సిబ్బంది ఉంటూ.. గేటును ఆపరేట్ చేయడం చూస్తుంటాం. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా వచ్చిన రైలు నుంచి కిందకు దిగి గేటును ఆపరేట్ చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral Video: వామ్మో.. పూర్తిగా కట్ చేసిన చేపను నీళ్లలోకి వేయగా.. చివరకు ఏమైందో చూడండి..


అయితే దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. మహారాజ్‌గంజ్ దరోండా-మషార్ఖ్ మధ్య ఒక్క రైలు మాత్రమే నడుస్తుందని చెప్పారు. ఒకే రైలు నాలుగు ట్రిప్పులు నడుస్తుందని, ఈ కారణంగానే రైల్వే గేటు వద్ద సిబ్బందిని నియమించలేదని చెబుతున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఒకే రైలేు అయినా సిబ్బంది ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి’’.. అంటూ కొందరు, ‘‘అరే.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2024 | 03:53 PM