Share News

Viral Video: సడన్‌గా ట్రక్కుకు అడ్డుగా వచ్చిన కారు.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:51 PM

చాలా వరకు రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనం సక్రమంగా వెళ్తున్నా ఎదుటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రాణాలు కోల్పోవడమో, గాయాలపాలవడమో జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు..

Viral Video: సడన్‌గా ట్రక్కుకు అడ్డుగా వచ్చిన కారు.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

చాలా వరకు రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనం సక్రమంగా వెళ్తున్నా ఎదుటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రాణాలు కోల్పోవడమో, గాయాలపాలవడమో జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు తమాషా సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కారు సడన్‌‌గా ట్రక్కుకు అడ్డుగా వచ్చింది. అయితే చివరకు జరిగింది చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ట్రక్కు (truck) రోడ్డుపై వెళ్తుండగా.. మార్గ మధ్యలో తమాషా ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో ఓ కారు ఎడమ వైపు నుంచి సడన్‌గా రోడ్డు మీదకు వచ్చేస్తుంది. అప్పటికే ట్రక్కు కారు సమీపానికి వెళ్లడంతో డ్రైవర్ బ్రేకులు వేస్తాడు. దీంతో కారు సమీపానికి వెళ్లి ఆగిపోతుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఆ ట్రక్కు సిమెంట్ కాంక్రీట్ మోసుకెళ్తుండడంతో బ్రేకు వేయగానే (Concrete fell on the car) కాంక్రీట్ మొత్తం కారుపై పడిపోతుంది. ఈ ఘటనలో ఆ కారు పూర్తిగా కాంక్రీట్‌లో మునిగిపోతుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరకపోకవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరకు కారు పరిస్థితి చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఒకవేళ ట్రక్కు వేగంగా వెళ్తూ ఉండుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంతా చర్చించుకుంటున్నారు.

Viral Video: చిరుతపులితో దొంగా పోలీస్ ఆట.. ఈ కోతి టాలెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘కాంక్రీట్‌లో మునిగిపోయిన కారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2024 | 04:51 PM