Share News

Viral Video: కారు ఇంజిన్‌పై బంగారు నగలు వదిలివెళ్లిన యువతి.. అరగంట తర్వాత వెళ్లి చూడగా..

ABN , Publish Date - Dec 07 , 2024 | 08:46 PM

బంగారు ఆభరణాలు ధరించి బయటికి వెళ్తే.. తిరిగి క్షేమంగా వచ్చే పరిస్థితులు లేని రోజులివి. పట్టపగలు మహిళ మెడల్లో బంగారు చైన్లు లాక్కుని వెళ్లి పోయే వారిని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: కారు ఇంజిన్‌పై బంగారు నగలు వదిలివెళ్లిన యువతి.. అరగంట తర్వాత వెళ్లి చూడగా..

బంగారు ఆభరణాలు ధరించి బయటికి వెళ్తే.. తిరిగి క్షేమంగా వచ్చే పరిస్థితులు లేని రోజులివి. పట్టపగలు మహిళ మెడల్లో బంగారు చైన్లు లాక్కుని వెళ్లి పోయే వారిని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వింత ప్రయోగం చేసింది. లక్షల రూపాయల విలువైన నగలను కారు ఇంజిన్‌పై పెట్టి వెళ్లిపోయింది. అరగంట తర్వాత వెళ్లి చూడగానే ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌కు (Dubai) చెందిన ఓ యువతి (young woman) వినూత్న ప్రయోగం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో బంగారు నగలు (gold ornaments) పెడితే చోరీకి గురవుతాయో లేదో అనే విషయంపై టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. రోడ్డు పైకి వెళ్లిన ఆమె.. తన మెడలోని హారం, ఉంగరాలను తీసి కారు బానైట్‌పై పెట్టింది. తర్వాత అక్కడే ఉన్న దుకాణంలోకి వెళ్లి బయట ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉంది.

Viral Video: పిసినారి పని చేసినా వరుడిని వదలని మరదలు.. వేదికపైకి వెళ్లి మరీ..


ఇలా అరగంట వరకూ ఆమె అక్కడే నిలబడి చూస్తుండిపోయింది. చాలా మంది అటూ ఇటూ తిరుగుతున్నా కూడా ఎవరూ ఆ నగలను పట్టించుకోలేదు. ఎవరి బిజీలో వారు వెళ్లిపోతున్నారే తప్ప ఆ నగలను ఎత్తుకెళ్లిపోవాలని ఎవరూ ప్రయత్నించలేదు. ఇలా అరగంట వరకూ చూసిన ఆ యువతి.. తర్వాత అక్కడికి వెళ్లి తన నగలను తాను తీసేసుకుంది. రోడ్డుపై బంగారు నగలను ఉంచినా ఎవరూ ముట్టుకోకపోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి రక్షణ ఉన్న ఒకే ఒక్క దేశం దుబాయ్ అని ఆమె చెప్పింది.

Viral Video: పర్వతం పైకి బల్లిలా పాకుతూ వెళ్లాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దుబాయ్‌లో దొంగతనం చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు.. అందుకే అక్కడ చోరీలు జరిగే అవకాశాలు చాలా తక్కువ’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి టెస్ట్ ఇండియాలో పెడితే బంగారుతో పాటూ కారు కూడా కనపడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 07 , 2024 | 08:46 PM