Share News

Viral Video: దర్జాగా చోరీ చేయడం అంటే ఇదేనేమో.. రోడ్డు మధ్యలో వీళ్ల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:07 PM

Watch video: రోజురోజుకూ నేరాలు పెరిగిపోవడం చూస్తున్నాం. ఈ క్రమంలో చాలా మంది చోరీలు చేయడంలో వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. కొందరు చేసే నేరాలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటున్నాయి. మరికొందరు దొంగలు.. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఎంతో దర్జాగా నేరాలు చేస్తుంటారు. ఇలాంటి ..

Viral Video: దర్జాగా చోరీ చేయడం అంటే ఇదేనేమో.. రోడ్డు మధ్యలో వీళ్ల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
Delhi Street Lights Theft

రోజురోజుకూ నేరాలు పెరిగిపోవడం చూస్తున్నాం. ఈ క్రమంలో చాలా మంది చోరీలు చేయడంలో వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. కొందరు చేసే నేరాలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటున్నాయి. మరికొందరు దొంగలు.. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఎంతో దర్జాగా నేరాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు.. పట్టపగలు నడి రోడ్డుపై చేసిన చోరీ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘దర్జాగా చోరీ చేయడం అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులు వీధి లైట్లను చోరీ చేసేందుకు (Theft of street lights) మాస్టర్ ప్లాన్ వేశారు. రాత్రి వేళల్లో స్తంభాలు ఎక్కితే చోరీ అనే విషయం తెలిసిపోతుందని, అదే పగటిపూట అయితే ఎవరికీ అనుమానం రాదని నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా.. పగటి వేళల్లో రోడ్డు మధ్యలో ఉన్న ఎత్తైన స్తంభాన్ని ఎక్కేశాడు.

Viral Video: ఏందిరయ్యా ఇదీ..! విమానం అనుకున్నావా.. రైలు బోగీ అనుకున్నావా.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..


పైకి ఎక్కిన తర్వాత లైటు ఊడదీసి, దానికి తాడు కట్టి పైనుంచి కిందకు జారవిడిచాడు. కింద ఉన్న మరో యువకుడు దాన్ని తీసుకుని ఎంచక్కా సంచుల్లో వేసుకుంటున్నాడు. ఇలా ఒక్కో స్తంభం ఎక్కుతూ దర్జాగా లైట్లను పీకిపడేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అక్కడున్న వారికి అనుమానం వచ్చినట్లుంది. దీంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుకుని వారి వద్దకు వెళ్లారు. వాళ్లను చూడగానే కింద ఉన్న వ్యక్తి అక్కడి నుంచి సంచి అక్కడే వదిలేసి పారిపోయాడు. స్తంభంపై ఉన్న వ్యక్తి కిందకు దిగగానే అతన్ని పట్టుకున్నారు.

Viral Video: దారి మధ్యలో ప్రేమ జంట.. వెనుకే నిలబడ్డ పెంగ్విన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదే పని రాత్రి చేస్తే చోరీ.. పగలు చేస్తే రిపేరు’’.. అంటూ కొందరు, ‘‘ఈ దొంగల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 9.92 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 26 , 2024 | 04:07 PM