Viral Video: ఏందిరయ్యా ఇదీ..! విమానం అనుకున్నావా.. రైలు బోగీ అనుకున్నావా.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Dec 25 , 2024 | 09:03 PM
Watch video: కొన్నిసార్లు కొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు కొందరు చేసే పనులు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇటీవల చాలా మంది బస్సు, రైల్వే స్టేషన్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..
కొన్నిసార్లు కొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు కొందరు చేసే పనులు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇటీవల చాలా మంది బస్సు, రైల్వే స్టేషన్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విమానంలో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘విమానం అనుకున్నావా.. రైలు బోగీ అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా విమానంలోకి ఎక్కి ఎవరీ సీట్లలో వారు కూర్చున్నారు. అయితే ఇంతలో ఓ వ్యక్తి తన బ్యాగులోంచి ఫ్లాస్క్ బయటికి తీశాడు. ఏం చేస్తు్న్నాడబ్బా... అని అంతా ఆలోచిస్తుండగా.. ప్లాస్టిక్ కప్పులను బయటికి తీసి, ఒక్కొక్కరి చేతిలో పెడుతూ ఫ్లాస్క్‌లోని టీని పోస్తున్నాడు.
Viral Video: దారి మధ్యలో ప్రేమ జంట.. వెనుకే నిలబడ్డ పెంగ్విన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
రైలు బోగీలో టీ విక్రయించే తరహాలో ఇతను కూడా టీ అని అరుస్తూ (man serving tea in airplane) అందరికీ పోయడం చూసేవారికి విచిత్రంగా అనిపించింది. ఇలా తన ఫ్లాస్క్‌లోని టీని మొత్తం ప్రయాణికులకు పంచేశాడు. ఇతడి నిర్వాకం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియో చూసి అవాక్కవుతున్నారు.
ఆ వ్యక్తి అలా విమానంలో టీ పోస్తున్నా సిబ్బంది అడ్డుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్రదర్, అది విమానం అనుకున్నావా.. లేక రైలు బోగీ అనుకున్నావా’’.. అంటూ కొందరు, ‘‘విమానాన్ని కాస్తా.. చాయ్ దుకాణంగా మార్చేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2200కి పైగా లైక్‌లు, 53వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..