Share News

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:44 PM

ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా
MS Dhoni Creates Alltime Record In IPL

ఐపీఎల్-2024లో (IPL 2024) అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 150 మ్యాచ్‌ల విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా అతను చరిత్రపుటలకెక్కాడు. ఆదివారం (28/04/24) చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించడంతో.. ధోనీ ఖాతాలో ఈ 150 విజయాల రికార్డ్ చేరింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 259 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 150 విజయాలు, 109 ఓటముల్లో భాగం అయ్యాడు.


కింగ్‌ఫిషర్ బీర్లు దొరకట్లేదు.. ఆదుకోండి మహాప్రభో!!

ధోనీ తర్వాత 133 విజయాలతో సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అనంతరం దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) 125 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, సురేష్ రైనా (Suresh Raina) 122 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌తో పాటు గత సీజన్‌కి రైనా దూరంగా ఉన్నప్పటికీ.. టాప్-5లో అతడు నాలుగో స్థానంలో ఉండటం విశేషం. కానీ.. 250కి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం టాప్-5లో లేకపోవడం గమనార్హం. కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యధికంగా ఓటములు నమోదు చేయడమే అందుకు కారణమని చెప్పుకోవడంలో సందేహం లేదు.

ఈ ఫుడ్స్ తీసుకుంటే.. లివర్‌కి మంచిది కాదు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ (98) ఊచకోత కోయడంతో పాటు డేరిల్ మిచెల్ (52), శివమ్ దూబే (39) మెరుపులు మెరిపించడంతో.. చెన్నై జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేయడం వల్లే.. సన్‌రైజర్స్ ఈ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మార్క్‌రమ్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 29 , 2024 | 06:44 PM