Share News

MS Dhoni: భార్య సాక్షితో కలసి ధోని డ్యాన్స్.. స్టెప్స్ మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:46 PM

MS Dhoni: టీమిండియా లెజండ్ మహేంద్ర సింగ్ అంటే కీపింగ్-బ్యాటింగ్ మాయాజాలం, అద్భుతమైన నాయకత్వమే గుర్తుకొస్తాయి. కానీ తనలో మరో టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేశాడు మాహీ. భార్య సాక్షితో కలసి మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.

MS Dhoni: భార్య సాక్షితో కలసి ధోని డ్యాన్స్.. స్టెప్స్ మామూలుగా లేవుగా..

టీమిండియా లెజండ్ మహేంద్ర సింగ్ అంటే కీపింగ్-బ్యాటింగ్ మాయాజాలం, అద్భుతమైన నాయకత్వమే గుర్తుకొస్తాయి. అంతగా క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు మాహీ. భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. మెన్ ఇన్ బ్లూకు గుడ్‌బై చెప్పేసినా క్యాష్ రిచ్ లీగ్‌లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. క్రికెట్‌ను పక్కనబెడితే యాడ్స్‌ ద్వారా అభిమానులను అలరిస్తుంటాడు ధోని. ఎక్కువగా బయట కనిపించడీ దిగ్గజ ఆటగాడు. అయితే ఫామ్‌హౌజ్‌లో వ్యవసాయ పనులు చేస్తున్న ఫొటోలు, అలాగే ఫ్యామిలీతో కలసి దిగే పలు వీడియోలను నెట్టింట పంచుకుంటూ ఉంటాడు. అలాంటోడు తాజాగా మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.


స్థానికులతో కలసి..

ఎప్పుడూ బ్యాట్‌తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తే ధోని ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీశాడు. భార్య సాక్షితో కలసి మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు మాహీ. అతడి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా కుటుంబంతో కలసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నాడు ధోని. ఈ క్రమంలో రిషికేష్‌లో స్థానికులతో కలసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ‘పహాడీ’, ‘గులాబీ షరారా’ అనే జానపద పాటలకు స్థానిక ప్రజలతో కలసి ధోని-సాక్షి దంపతులు కాళ్లు కదిపారు. ఇద్దరూ ట్యూన్స్‌కు తగ్గట్లు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.


మాస్ స్టెప్స్

స్థానికులంతా అక్కడి సంప్రదాయ దుస్తులు వేసుకోగా.. ధోని దంపతులు సాధారణ బట్టల్లో కనిపించారు. చేతులు పట్టుకొని బాణీకి తగ్గట్లుగా కాళ్లు కదుపుతూ ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ధోనీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. మాహీకి సిగ్గు ఎక్కువ.. అందుకే డ్యాన్స్ లాంటివి చేయడని అనుకుంటారు. కానీ ఫ్యామిలీతో కలసి వెకేషన్‌కు వెళ్లడంతో స్టెప్ప్ వేయక తప్పలేదేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాహీ అదరగొట్టాడని.. డ్యాన్స్ మూవ్స్ బాగున్నాయని మెచ్చుకుంటున్నారు.


Also Read:

దూబె-సూర్య సిక్సుల మోత.. బౌలర్లకు నరకం చూపించారు

ఈ క్యాప్ విలువ 2 కోట్లు.. సచిన్, కోహ్లీది కాదు.. ఏ ప్లేయర్‌దో చెప్పండి చూద్దాం

70 వేల కోట్లకు వారసుడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్

For More Sports And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 03:46 PM