Home » Sakshi Dhoni
MS Dhoni: టీమిండియా లెజండ్ మహేంద్ర సింగ్ అంటే కీపింగ్-బ్యాటింగ్ మాయాజాలం, అద్భుతమైన నాయకత్వమే గుర్తుకొస్తాయి. కానీ తనలో మరో టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేశాడు మాహీ. భార్య సాక్షితో కలసి మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఏ అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అది మాహీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్. ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసినా అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా తన పెంపుడు కుక్కలతో ధోనీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
మహేంద్రసింగ్ ధోనీ(Mahendra singh Dhoni). క్రికెట్‌లోకి (Cricket) అడుగుపెట్టక ముందు ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి. కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్‌లో టీసీగా(Ticket collector) పని చేశాడు. కుటుంబంతో ఒక అద్దె గదిలో నివాసం ఉన్నాడు. కానీ క్రికెట్ మహేంద్రుడి జీవితాన్ని మార్చేసింది. పేరు ప్రఖ్యాతలతోపాటు వందల కోట్లకు అధిపతిని చేసింది. సరైన టాలెంట్ ఉండి, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల బలంగా ఉంటే ఒక మనిషి జీవితంలో ఏ స్థాయికి ఎదగగలడనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ధోని.