AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!
ABN , Publish Date - Apr 18 , 2024 | 01:56 PM
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా.. తొలి నామినేషన్ ఎవరు వేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి నెటిజన్లు, ఆంధ్రా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో సెర్చ్ చేస్తున్నారు.
ఇంతకీ ఎవరాయన..?
ఆంధ్రప్రదేశ్‌లో తొలి నామినేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) నామినేషన్‌ను.. ఆయన సతీమణి హేమలత దాఖలు చేశారు. పయ్యావుల అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన హేమలత.. స్థానికంగా ఉన్న తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆంధ్రాలో తొలి నామినేషన్ కావడంతో కేశవ్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా.. పయ్యావుల కేశవ్‌దే తొలి నామినేషన్ అని ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈసీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులే.. అధికార పార్టీ కంటే ముందుగా తొలి నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్లు ఇలా..!
కాగా.. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈనెల 26 నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. అలాగే.. మే 13న పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..