Sheep scheme: ఆ స్కామ్‌లో రాజకీయ నేత పాత్రమై ఏసీబీ వద్ద సమాచారం!
ABN , Publish Date - Mar 04 , 2024 | 10:41 AM
Telangana: గొర్రెల పథకం నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు,ఆవులు, బర్రెల స్కీంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్‌లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్, మార్చి 4: గొర్రెల పథకం నిధుల (sheep scheme funds) గోల్‌మాల్‌పై ఏసీబీ (ACB) దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు, ఆవులు, బర్రెల స్కీంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్‌లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పశుసంవర్ధక శాఖలో అధికారులు కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌తో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ నిర్ధారించింది. మొయినుద్దీన్ వెనుక ఉన్న రాజకీయ నాయకుడి పాత్రపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆరు భోగస్ కంపెనీల పేరుతో పశుసంవర్ధక శాఖలో మొయినుద్దీన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించనుంది. పశుసంవర్ధక శాఖలో కిందిస్థాయి ఉద్యోగులు సహకరించకుంటే అధికారులు.. వారికి చార్జి మెమోలు ఇచ్చినట్లు, ట్రాన్స్ఫర్లు చేయించినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది.
ఇవి కూడా చదవండి..
Shamshabad Airport: వామ్మో ఎంత బంగారమో...!
YCP: ఒక్కో వాలెంటీర్‌కు రూ. 5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...