Share News

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

ABN , Publish Date - May 21 , 2024 | 03:30 PM

నగరంలోని పలుచోట్ల ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!
ACB Raids

హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అత్యంత సంచలనం కలిగించిన సాహితీ ఇన్‌ఫ్రా కేసును ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రత్యేక చీఫ్‌ అధికారిగా ఆయన ఉన్నారు. పెద్ద ఎత్తున సాహితీ సంస్థ మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

బీజేపీ నేతకు బెదిరింపులు

సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఎనిమిది గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న సమయంలో ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సాహితీ ఇన్‌ ఫ్రా కేసులో నిందితులనుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు అందాయి. సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఉమా మహేశ్వరరావు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. గతంలో బీజేపీ నేత చరణ్ చౌదరిని బెదిరించి , టాస్క్‌ఫో‌ర్స్ డీసీపీ రాధకిషన్ రావు సహాయంతో రూ.30 లక్షలు నగదుని చరణ్ స్నేహితులు ద్వారా ఏసీపీ ఉమామహేశ్వరరావు నగదు బదిలీ చేయించుకున్నారు. ఏక కాలంలో ఎనిమిది చోట్ల..ఏపీ , తెలంగాణాలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


భారీగా ఇస్తులు..!

ఫ్రీలాచింగ్ ఆఫర్లతో బాధితుల నుంచి భారీగా సొమ్ములను వసూలు చేసింది. సుమారుగా రూ.1800 కోట్ల వరకు ఈ సంస్థ మోసాలకు పాల్పడిందని సీసీఎస్ అధికారులు నిగ్గు తేల్చారు. సాహితీ సంస్థ కేసులోనూ ఉమామహేశ్వరరావు అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించి పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారని ఏసీబీకి ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా ఉంచిన ఏసీపీ అధికారులు ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు కలకలం రేపుతున్నాయి.


ఆ రెండు అంశాలపై ఏసీబీ దృష్టి

సాహితీ ఇన్‌ఫ్రా బాధితులు 2500కు పైగా ఉన్నారు. బాధితుల నుంచి ఈ సంస్థ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడింది. ఫ్రీలాచింగ్ పేరుతో పూర్తిస్థాయిలో భవనాలు నిర్మించి ఇస్తామని సదరు సంస్థ బాధితులను మోసం చేసి పలు ప్రాజెక్టుల్లోకి నగదును మళ్లించింది. ఈ సంస్థపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఉమామహేశ్వరరావు చీఫ్‌గా ఉన్నారు. ఆయనను నియమించిన తర్వాత బాధితులకు ఎక్కడ న్యాయం జరుగలేదు. సాహితీ ఇన్ ఫ్రా కేసు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఈ రెండు అంశాలతో ఏసీబీ అధికారులు గంటసేపటి నుంచి సోదాలు చేస్తున్నారు.


10 టీం లతో పలు ప్రాంతాల్లో సోదాలు

ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడిన అధికారులు పలు ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. ముందుగా అశోక్ నగర్‌లోని ఏసీపీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీపీ బంధువులు, స్నేహితులు, సన్నిహితంగా ఉండే వారి నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పది టీమ్‌లుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అత్యంత వివాదాస్వద అధికారిగా ఉమామహేశ్వరరావుకు పేరుంది. ఆయన పనిచేసిన పలు ప్రాంతాల్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈయనపై అవినీతి ఆరోపణలు ఉండటంతో పాటు మహిళలను అసభ్యంగా దుర్బాషలు ఆడతారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

ఆ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి: సోమిరెడ్డి

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 03:54 PM