Adi Srinivas: అందుకే హరీశ్‌ను బండి సంజయ్ పొగడుతున్నారు
ABN , Publish Date - Jul 15 , 2024 | 09:25 PM
తెలంగాణలో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. ఢిల్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. ఢిల్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారని అన్నారు. కవిత బెయిల్ కోసమే బీజేపీకి బీఆర్ఎస్ నేతలు స్నేహ హస్తం అందిస్తున్నారని చెప్పారు. హరీష్ రావు ప్రజా నేత అని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ డబ్బాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
ALSO Read: Komatireddy: ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
నిన్నటి దాకా హరీష్ రావుపైన దుమ్మెత్తిపోసిన బీజేపీ నేతలు ఇప్పుడు పొగుడుతున్నారని అన్నారు. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఆయనతో రాజీనామా చేయించి బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీష్ రావు మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ALSO Read: Chinna Reddy: తెలంగాణలో డిక్టేటర్స్ పాలన.. బీఆర్ఎస్‌పై చిన్నారెడ్డి ఫైర్
విలీనానికి కేసీఆర్ ఒప్పుకోకపోతే హరీష్ రావు ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్‌ను చీల్చే అవకాశాలున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ పైన బీజేపీ చేస్తుందనే అనుమానాలున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసమే రెండు పార్టీలు ముసుగు తీసి వస్తున్నాయని విమర్శించారు.
బండి సంజయ్, హరీష్ రావు ప్రజా నేత అని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ రఘనందన్ రావు సమర్థిస్తారా..? అని ప్రశ్నించారు. మెదక్‌లో బీజేపీ గెలుపు కోసం లోపాయికారీ ఒప్పందం జరిగినట్లు బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైనా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇబ్బంది లేదని ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Madhuyashki: ఆ ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్
Tourists: వికారాబాద్‌లో టూరిస్టులకు వింత కష్టాలు!
Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..
Read Latest Telangana News And Telugu News