Share News

BJP: ఇందిర పార్క్ వద్ద కొనసాగుతున్న బీజేపీ రైతు దీక్ష

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:42 AM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) పోరుకు సిద్ధమైంది. సోమవారం ఇందిరా పార్క్ (Indira Park) ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష (Deeksha) చేపట్టింది. నిన్న ( సోమవారం) ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైన బీజేపీ దీక్ష ఈరోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిపారు.

BJP: ఇందిర పార్క్ వద్ద కొనసాగుతున్న  బీజేపీ రైతు దీక్ష

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) పోరుకు సిద్ధమైంది. సోమవారం ఇందిరా పార్క్ (Indira Park) ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష (Deeksha) చేపట్టింది. నిన్న ( సోమవారం) ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైన బీజేపీ దీక్ష ఈరోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిపారు. రైతు హామీల (Farmer guarantees) అమలు సాధన పేరిట 24 గంటల పాటు దీక్షకు బీజేపీ పిలువునిచ్చింది.


రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీల అమలుపై కమలం పార్టీ దీక్ష చేపట్టింది. ఈ నిరసన దీక్షలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 24 గంటల నిరంతర దీక్షలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, మద్దతు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.


రుణమాఫీ సగంమందికి కూడా పూర్తి చేయలేదని బీజేపీ నేతలు ఆరోపించారు . అన్నదాతలందరికీ వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతు భరోసా, బోనస్ కూడా విడుదల చేయాలని కోరారు. బీజేపీ దీక్షపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. కేంద్రం రైతుల ఆదాయం రెట్టింపు చేసిందా అని తుమ్మల నిలదీశారు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు మహేశ్వర రెడ్డి, ఈటల కౌంటర్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

రూ. 8,113 కోట్ల షాక్

నేరస్థులను వదలొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 01 , 2024 | 09:43 AM