BJP: బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు.. ఏం చర్చిస్తారంటే?
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:16 PM
Telangana: బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీలో చేరికలపై బీజేపీ కార్యవర్గం ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, జూలై 12: బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు (BJP state wide executive meetings ) శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీలో చేరికలపై బీజేపీ కార్యవర్గం ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని బండి సంజయ్ (BandiSanjay) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Tirumala: తిరుమలలో మహిళకు ఊహించని ఘటన..
ఈ సమావేశాలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ అభయ్ పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శంషాబాద్ మల్లికా కన్వెన్షన్‌లో కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) ఆధ్వర్యంలో జరుగుతోన్న సమావేశాల్లో లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల, గరికపాటి తదితరులు పాల్గొన్నారు. అలాగే పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, కార్పోరేటర్లు హాజరయ్యారు.
Uttarakhand: బద్రీనాథ్ హైవే మూసివేత..
పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం ఇది. భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేసేలా ఒత్తిడి తీసికొచ్చే కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Handloom Sector: జగన్ పాలనలో పూర్తిగా కుదేలైన చేనేత రంగం..
Read Latest Telangana News And Telugu News