Share News

KTR: ‘యథా రాజా తథా ప్రజా’.. దళిత మహిళపై దాడిని ఖండించిన కేటీఆర్

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:44 PM

Telangana: దళిత మహిళపై పోలిసుల దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?

KTR: ‘యథా రాజా తథా ప్రజా’.. దళిత మహిళపై దాడిని ఖండించిన కేటీఆర్
BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 5: దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (BRS Working President KTR) తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..! కొడుకు ముందే చిత్ర హింసలా?’’ అంటూ మండిపడ్డారు.

BRS: బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు: కేటీఆర్



రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో... మహిళలంటే ఇంత చిన్నచూపా అని ప్రశ్నించారు. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు.. మరోవైపు దాడులు, దాష్టీకాలు..! యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారన్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.


వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదని... ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయవద్దని హితవుపలికారు. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమన్నారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలన్నారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ ట్వీట్ చేశారు.

CM Chandrababu: ఈ కాన్ఫరెన్స్ చరిత్రాత్మకమైనది..


ఇదీ జరిగింది....

బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోవడంతో.. ఫిర్యాదుదారు కారులో ఇంటికి పంపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్‌లోని అంబేడ్కర్‌ కాలనీలో ఉంటున్న నాగేందర్‌.. తన ఇంట్లో 26 తులాల బంగారం, రూ. 2లక్షల నగదు చోరీకి గురైందని జూలై 24న షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి సమీపంలో ఉండే సునీత, భీమయ్య దంపతులపై అనుమానం ఉందని చెప్పాడు. దీంతో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామిరెడ్డి అదే రోజున సునీత, భీమయ్య దంపతులతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.


అనంతరం భీమయ్యను పంపించారు. ఆ తర్వాత నేరం ఒప్పుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ తనను విచక్షణా రహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. మగ పోలీసులు తనపై ఎక్కడపడితే దాడి చేశారని, తన కుమారుడిని లాఠీతో కొట్టారని తెలిపింది. తాను స్పృహ కోల్పోవడంతో నాగేందర్‌ కారులో తనను ఇంటికి పంపించారని వెల్లడించింది. అయితే, దొంగతనం కేసులో సునీతపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి 13 రోజులు గడుస్తున్నా.. ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమెను కొట్టారని.. అరెస్టుకు ముందు ఆస్పత్రికి తీసుకువెళితే గాయాలు కనిపిస్తాయనే అరెస్టు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తారు.


ఇవి కూడా చదవండి...

Teharan : మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 01:47 PM