Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...
ABN , Publish Date - Aug 05 , 2024 | 12:32 PM
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన భార్య పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు.
అనంతపురం, ఆగస్టు 5: రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna Reddy) అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన భార్య పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ బాధితులతో 20న సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క బాధితునికి న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు (CM Chandrababu) చర్యలు తీసుకోవాలని కోరారు.
Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..
చంద్రబాబు స్పందన బాగుందని.. ఆ తర్వాత చర్యలు ఉండటం లేదని వెల్లడించారు. రాయలసీమలో కరవు పరిస్థితులపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే పెట్టుసాయం రూ.20 వేలు అందించాలన్నారు. ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా అందివ్వాలని తెలిపారు. ఇజ్రాయల్ దాడుల కారణంగా ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి ఉందన్నారు. అగ్రదేశం అమెరికా దీనికి మద్దతు పలకడం సరైంది కాదన్నారు. ప్రధాని మోడీ కూడా పాలిస్తీనాకు అండగా నిలబడాలని సీపీఐ నేత రామకృష్ణ కోరారు.
AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లు ఎప్పుడో..!?
కాగా.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలపై టీడీపీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రారెడ్డితో పాటు పలువురు టిడిపి బృందం కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీసే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటవలే మీడియాతో పేర్కొన్న విషయం తెలిసిందే..
ఇవి కూడా చదవండి...
TDP Vs YSRCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంచుకోటలో టీడీపీ మాస్టర్ ప్లాన్!
AP News: అయ్యో పాపం.. కుక్క కాటుతో బాలుడికి మూడు నెలలుగా చికిత్స.. అంతలోనే
Read Latest AP News And Telugu News