TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం
ABN , Publish Date - Jul 30 , 2024 | 04:16 PM
Telangana: నగరంలోని నార్సింగీ గంధంగూడలో బుల్లెట్ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి అకస్మాత్తుగా బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఇంట్లోని మహిళకు గాయాలయ్యాయి. కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మహిళ కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
హైదరాబాద్, జూలై 30: నగరంలోని నార్సింగీ గంధంగూడలో బుల్లెట్ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి అకస్మాత్తుగా బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఇంట్లోని మహిళకు గాయాలయ్యాయి. కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మహిళ కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే నార్సింగి పోలీసులు (Police) ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్మీ ఫయరింగ్ రేంజ్‌లో జవాన్లు ఫయరింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెలలోనే ఇలా జరగడం ఇది రెండవ సారిగా స్థానికులు చెబుతున్నారు.
Stock Market: రోజంతా ఒడిదుడుకులు.. రెండో రోజూ స్వల్ప లాభాలతోనే ముగిసిన సూచీలు..!
బాధితురాలి మాటల్లో...
ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పద్మ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఘటన ఎలా జరిగిందో వివరించారు. బట్టలు ఆరేసేందుకు బయటకు వెళ్లిన సమయంలో బుల్లెట్ వచ్చి తగిలిందని.. కాలికి తగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే తలకు తగిలి ఉంటే తన ప్రాణాలు పోయేవని బాధితురాలు వాపోయారు.
Balaraju: జనసేన ఎమ్మెల్యే సడెన్ ఎంట్రీ.. దొరికిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!?
‘‘నేను ఇంట్లో ఉన్న సమయంలో తన కాలుకు గాయమైంది. ఇంటి గుమ్మం నుంచి బట్టలు ఆరవేయడానికి బయటికి వచ్చాను. ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. అప్పటికే తన కాలుకు బలమైన గాయమైంది. కాలుకు తగిలిన బుల్లెట్ పక్కనే పడిపోయింది. వెంటనే డయల్ 100కు సమాచారం అందించాం. నార్సింగి పోలీసులు మా ఇంటికి చేరుకొని నన్ను గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయస్థితి లేదని చెప్పి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఈరోజు నా టైం బాగుంది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాను. తలకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవి. తన కాలుకు తగిలిన వెంటనే అక్కడే బుల్లెట్ దొరికింది. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది నాకు తెలియదు. పెద్ద శబ్దంతో బుల్లెట్ నా కాలుకు తగిలింది. వెంటనే బయటికి వెళ్లి చూశాను. ఆ సమయంలో బయట ఎవరూ కూడా మనుషులు లేరు. ఇంట్లో ఉన్న తనకు బుల్లెట్ తగలడంతో షాక్‌కు గురయ్యాను’’ పద్మ తెలిపారు. కాగా... బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
TS Govt: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు
Read Latest Telangana News And Telugu News