TG PGECET 2024 Counselling: పీజీఈసెట్ కౌన్సింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..
ABN , Publish Date - Jul 30 , 2024 | 03:55 PM
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్(TGCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ (TG PGECET) 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు..
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్(TGCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ (TG PGECET) 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecetadm.tsche.ac.in ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
షెడ్యూల్ ప్రకారం.. TG PGECET-2024 కౌన్సెలింగ్ కోసం ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 9వ తేదీ నాటికి ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఇక స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్స్ ఫిజికల్ వేరిఫికేషన్ ఆగష్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య జరుగనుంది. వేరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాలను ఆగష్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు.
కాగా, కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్‌మెంట్ దశలు ఉంటాయి. రౌండ్ 1 కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఎంట్రీ విండో ఆగస్టు 12 నుండి 13 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులలు ఆగస్టు 14న వెబ్ ఎంట్రీ ఆప్షన్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. సీట్ అలాట్ అయిన అభ్యర్థుల జాబితా ఆగస్టు 17న విడుదల చేస్తారు. రిపోర్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆగష్టు 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక కొత్త బ్యాచ్‌కు క్లాస్‌లు ఆగస్టు 31న ప్రారంభమవుతాయి.
రిజిస్ట్రేషన్ ఫీజు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సబ్‌మిషన్‌కు అభ్యర్థులు ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.1,200, షెడ్యూల్డ్ కులాలు(SC), షెడ్యూల్డ్ తెగలు(ST) అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపులను ఆన్‌లైన్ చెల్లింపు(క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు/ఇంటర్నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లించవచ్చు. ఆగస్టు 9 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చివరి తేదీగా ప్రకటించారు.
అభ్యర్థులూ ఇవి తప్పనిసరి..
TG PGECET 2024 హాల్ టికెట్
TG PGECET ర్యాంక్ కార్డ్
డిగ్రీ సర్టిఫికేట్/ప్రొవిజనల్ సర్టిఫికేట్
కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో (CMM)
బదిలీ సర్టిఫికేట్ (TC)
మైగ్రేషన్ సర్టిఫికేట్
ఆదాయ ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
నివాస ధృవీకరణ పత్రం
శారీరక వికలాంగుల సర్టిఫికేట్
క్రీడలు/NCC/PH సర్టిఫికెట్లు