Share News

Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..

ABN , Publish Date - Aug 08 , 2024 | 11:49 AM

ఆగస్ట్ 9వ తేదీన ఛత్రపతి శివాజీ జన్మించిన జన్నర్‌లోని శివనేరి ఫోర్ట్‌ నుంచి ఈ యాత్రను చేపట్టనున్నారు. మరోవైపు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలో జన సన్మాన్ యాత్ర ఆగస్ట్ 8వ తేదీ అంటే ఈ రోజు నాసిక్‌ నుంచి ప్రారంభం కానుంది.

Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..

ముంబయి, ఆగస్ట్ 08: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. అలాంటి వేళ.. ఎన్నికల సమరానికి పలు రాజకీయ పార్టీలు ఆస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ ) అధినేత శరద్ పవార్.. శివ స్వరాజ్య యాత్రకు శ్రీకారం చుట్టునున్నారు. అందుకు ముహుర్తాన్ని సైతం ఖరారు చేశారు. ఆగస్ట్ 9వ తేదీన ఛత్రపతి శివాజీ జన్మించిన జన్నర్‌లోని శివనేరి ఫోర్ట్‌ నుంచి ఈ యాత్రను చేపట్టనున్నారు. మరోవైపు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలో జన సన్మాన్ యాత్ర ఆగస్ట్ 8వ తేదీ అంటే ఈ రోజు నాసిక్‌ నుంచి ప్రారంభం కానుంది.

Also Read:LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు


గౌరవానికి.. ఆత్మ గౌరవానికి..

సొంత సోదరులు శరద్ పవార్ ‘ఆత్మ గౌరవానికి’ ప్రతీకగా, అజిత్ పవార్‌ ‘గౌరవానికి’ సూచికంగా ఇలా వేర్వేరుగా ఒక రోజు తేడాతో యాత్రలకు శ్రీకారం చుట్టడం రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అలాగే యాత్ర యొక్క ఉద్దేశ్యాలతోపాటు విధి విధానాలకు సంబంధించిన ప్రోమోను సైతం ఇప్పటికే ఈ రెండు పార్టీలు విడుదల చేశాయి.

Also Read:Bangladesh Violence: భారత్‌లోని బంగ్లాదేశీ విద్యార్థుల్లో ‘ఆందోళన’


సంప్రదాయ ఓటర్లే లక్ష్యంగా..

రాష్ట్రంలోని ఎన్డీయే సారథ్యంలోని మహయూత్ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రవేశ పెట్టిన పథకాల వల్ల జరిగిన అభివృద్ధిని ఈ యాత్ర ద్వారా వివరించనుందీ అజిత్ పవార్ వర్గం. ఇక మహారాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమే అజెండాగా చేసుకుని రాష్ట్రంలోని సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ తన యాత్రను ప్రజల్లోకి తీసుకు వెళ్లనుంది.

Also Read: Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’


అందుకే ఆగస్ట్ 9వ తేదీ..

ఎన్సీపీ (శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షులు జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అవినీతితో ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 9వ తేదీన ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదానం నుంచి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమర యోధులు గో బ్యాక్ నినాదంతో పోరాటాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అందుకు ఆగస్ట్ 9వ తేదీన ఎంచుకున్నట్లు తెలిపారు.

ఇక జయంత్ పాటిల్ వ్యాఖ్యలపై అజిత్ పవార్ సైతం స్పందించారు. వారు రాజకీయాలు చేస్తునే ఉండాలన్నారు. తాము కేవలం అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే అజిత్ పవార్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఠట్కారే మాట్లాడుతూ.. తమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు లబ్ది పొందారని పేర్కొన్నారు. ఆ క్రమంలో తాము ప్రజల మధ్యకు వెళ్తున్నట్లు తెలిపారు.

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


ఆగస్ట్ 31తో ముగియనున్న అజిత్ యాత్ర..

పశ్చిమ మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో ఎన్సీపీ (శరద్ పవార్ ) ఈ యాత్ర చేపట్టనుంది. మొత్తం 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శివ స్వరాజ్య యాత్ర కొనసాగనుంది. అలాగే ఉత్తర మహారాష్ట్రలోని అజిత్ పవార్ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా విదర్భతోపాటు ముంబయిని తన యాత్రతో చుట్టేయనున్నారు. అజిత్ పవార్ యాత్ర ఆగస్ట్ 31తో ముగియనుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 11:51 AM