CM Revanth Reddy: న్యూ ఇయర్ వేడుకలకు సీఎం రేవంత్, మంత్రులు దూరం.. కారణమిదే
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:56 PM
CM Revanth Reddy: నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దూరంగా ఉండనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దూరంగా ఉండనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ మృతికి వారం రోజులు సంతాప దినాలను రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన సంవత్సర సందర్భంగా పూల బొకేలు, శాలువాలు, స్వీట్ బాక్స్‌లు తీసుకురావద్దని పార్టీ శ్రేణులకు సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో రైతు రాజ్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రైతులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఆయిల్ పామ్ రైతులకు టన్ను పామాయిల్ గెలల ధర రూ.20,506లుగా స్థిరీకరించబడిందని అన్నారు. నూతన సంవత్సర కానుకగా జనవరి మొదటి తేదీ నుంచి పెరిగిన ధరలు అమలవుతాయని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో రుణమాఫీతో రైతు రాజ్యం వచ్చిందని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్‌తో తెలంగాణ రైతాంగానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. అత్యధిక ధాన్యం ఉత్పత్తితో యావత్ దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని అన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పొలం బాట పట్టేలా తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే మార్గదర్శిగా మారబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Happy New Year 2025: ఫుల్ కిక్‌లో మందుబాబులు.. మూడ్రోజుల్లో ఎంత తాగారంటే..
KTR: మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన కేటీఆర్
Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
For More Telangana And Telugu News