Share News

Congress: విపత్తులో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:11 PM

విపత్కర సరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ (Sampath Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24×7 తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధికోసం విచక్షణలేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress: విపత్తులో  బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Sampath Kumar

ఢిల్లీ: విపత్కర సరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ (Sampath Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24×7 తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధికోసం విచక్షణలేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. విపత్తుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూ, ఫొటోలకు పోజులు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం హర్షించదని వార్నింగ్ ఇచ్చారు. బారీ వర్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు, కేంద్రం పెద్దమనసుతో రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని సంపత్ కుమార్ కోరారు. ఈరోజు (మంగళవారం) గాంధీభవన్‌లో సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ALSO Read: BRS VS Congress: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి.. ఎందుకంటే..?

మరొకసారి ఏఐసీసీ కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చినందుకు అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 11 ఏళ్లుగా భారతదేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని విమర్శలు చేశారు, మోదీ నియంతృత్వ చర్యలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. ఆరునెలలకు ఒకసారి రాష్ట్ర రాజకీయాలపై సమీక్ష చేస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని సంపత్ కుమార్ తెలిపారు.


ALSO Read: Jagadish reddy: పథకం ప్రకారమే మాపై దాడి

సంస్థాగతంగా పార్టీ బలోపేతం దిశగా విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు సంపత్ కుమార్ వెల్లడించారు. ఏఐసీసీ కమిటీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో ఈరోజు(మంగళవారం) సమావేశం జరిగిందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఏఐసీసీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీల సమావేశం జరిగిందని... ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత ముమ్మరంగా ప్రజలకు చేరువ చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేసే దిశగా తమ కార్యాచరణ ఉండబోతుందని సంపత్ కుమార్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

Mahesh kumar: బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 05:31 PM