తెలంగాణ మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్
ABN , Publish Date - Aug 16 , 2024 | 10:50 AM
Telangana: తెలంగాణ మహిళలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. మహిళల ఉచిత బస్ ప్రయాణం పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు నిరసనగా.. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ మహిళలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) సీరియస్ అయ్యింది. మహిళల ఉచిత బస్ ప్రయాణం పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు నిరసనగా.. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్‌లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్‌లు చేయండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Controversy: కీలక పరిణామం.. కేటీఆర్‌కు మహిళ కమిషన్ నోటీసులు!
తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం చేయాలని, నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
అసలేం జరిగిందంటే..
కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుర్వినియోగం జరుగుతోందంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు ఒలుచుకుంటే తప్పేంటని, కూట్లు అల్లికలు చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న తమకు అభ్యంతరం లేదని అన్నారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపాటి దుమారాన్నే రేపాయి. మహిళా వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను అవమానించారంటూ మండిపడ్డారు.
Elections: మళ్లీ ఎన్నికల కోలహలం.. నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్నికల సంఘం
సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్..
కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కీలక పరిణామం జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద అభిప్రాయపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
కేటీఆర్ ట్వీట్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు’ అని తాను అన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యాదాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
Lokesh: 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం..
Viral News: బీర్ టేస్ట్ చేసిన పాము.. చివరకు ఏమైందంటే..!
Read Latest Telangana News And Telugu News