Share News

Hyderabad: అధిక లాభాల పేరుతో వ్యాపారిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. చివరికి..

ABN , Publish Date - Nov 04 , 2024 | 08:02 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి Lazardoo vip టాప్ అనే సైబర్ ముఠా భారీ లాభాల ఆశ చూపింది. తాము చెప్పిన చోట పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. రూ.100 పెడితే రూ.200లు వస్తాయని నమ్మ బలికారు.

Hyderabad: అధిక లాభాల పేరుతో వ్యాపారిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. చివరికి..

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లేని ఆఫీసులు, ఇళ్లు ఉండడం లేదు. చిన్న పిల్లలు, టీనేజర్లు చేతుల్లో సైతం స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. టెక్నాలజీ ఆధారంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది. అయితే అదే సాంకేతికత నేడు మానవాళికి ప్రమాదకరంగా మారింది. కొంతమంది దాన్ని నేరాలు చేసి డబ్బులు సంపాదించేందుకు వినియోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ నగదు లావాదేవీలు చేస్తుండడంతో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.


దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ ఎంతో మంది ప్రజలు కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయని ఆశ చూపుతూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. లాటరీ తగిలిందని ఆ నగదు తీసుకోవాలంటే ముందుగా కొంత సొమ్ము చెల్లించాలని దగా చేస్తున్నారు. కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి.. మీ పేరుతో పార్శిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారు. కేసు నమోదు చేయకూడదంటే అడిగినంత ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయాలని, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు. వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. విలాసాలకు అలవాటు పడి అక్రమ సంపాదనే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు.


ముఖ్యంగా ఇలాంటి సైబర్ మోసాలు హైదరాబాద్ నగరంలో పెరిగిపోయాయి. వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సహా బాగా సంపాదించే వారే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి భాగ్య నగరంలో చోటు చేసుకుంది. పెట్టుబడుల పేరుతో ఓ వ్యాపారి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సొమ్ముని రికవరీ చేసి అండగా నిలిచారు.


హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి Lazardoo vip టాప్ అనే సైబర్ ముఠా భారీ లాభాల ఆశ చూపింది. తాము చెప్పిన చోట పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. రూ.100 పెడితే రూ.200లు వస్తాయని నమ్మ బలికారు. వారి మాటలకు మోసపోయిన బాధితుడు వారు చెప్పిన అకౌంట్‍‌లో సుమారు రూ.1.22 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే రోజుల గడుస్తున్నా లాభం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు వ్యాపారి గుర్తించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.


కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు నగదు పంపిన బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అనంతరం రూ.1.20 కోట్లను రికవరీ చేసి ఆ వ్యాపారికి అందించారు. అయితే సైబర్ మోసాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులు తమ ఖాతాల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సమాజంలో జరిగే ఇలాంటి నేరాలపై నిత్యం ఓ కన్నేసి ఉండాలని చెప్తున్నారు. అత్యాసకు పోయి ఉన్న నగదు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Harish Rao: గ్రామాన్ని అభివృద్ధి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 08:11 PM