Gold and Silver Rates: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Oct 01 , 2024 | 08:06 AM
పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి..
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర తగ్గితే వెంటనే కొనుగోలు చేస్తుంటారు. మరి ఈరోజు (1 అక్టోబర్ 2024) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర
హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే సెప్టెంబర్ 30 సోమవారం ధరతో పోలిస్తే అక్టోబర్ 1 మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.7,079గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.70,790గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,723గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.77,230గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.
వివిధ నగరాల్లో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి సోమవారంతో పోలిస్తే మంగళవారం గ్రాముకు రూపాయి తగ్గింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7,094గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.70,940గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.7,738గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.77,380గా ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,079గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.70,790గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,723గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.77,230గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7,079గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.70,790గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాము ధర రూ.7,723కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.77,230గా ఉంది.
దేశంలో వెండి ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు చూస్తే.. సోమవారంతో పోలిస్తే మంగళవారం స్వల్పంగా ధర తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.1,00,900గా ఉంది.
Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Business News and Latest Telugu News