Share News

Eatala Rajendar: వారిపై అక్రమ కేసులు పెట్టొద్దు.. సీఎం రేవంత్‌కు ఈటల వార్నింగ్

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:33 PM

ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్‌లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల్లో మోహరించి రైతులను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Eatala Rajendar: వారిపై అక్రమ కేసులు పెట్టొద్దు.. సీఎం రేవంత్‌కు ఈటల వార్నింగ్

ఢిల్లీ: రైతులపై అక్రమ కేసులు పెడితే మంచిది కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ వేదికగా రైతుల అరెస్ట్‌లపై స్పందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు. రేవంత్‌కు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.


ఫార్మా కంపెనీలకు రైతుల భూములు అప్పజెప్పే ప్రయత్నం

‘‘మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు. గ్రామసభలను బహిష్కరించారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టిన ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అడ్డం పెట్టుకుని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల్లో మోహరించి రైతులను అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం రూ.8 లక్షలకు భూములు సేకరించి రూ.1 నుంచి 2 కోట్లకు ఫార్మా కంపెనీలకు గత ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నం చేస్తే.. ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది’’ అని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం..

‘‘బీజేపీ కూడా దీనిని వ్యతిరేకించింది. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెబుతున్నారు, కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్‌లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదు. ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికాన్ని ఇబ్బందులు పెట్టొద్దు. ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదాం. మేమంతా మీకు అండగా ఉంటాం’’ అని ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

AP NEWS: వేట మొదలైంది.. సోషల్ మీడియా సైకోల భరతం పడుతున్న పోలీసులు

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 01:35 PM