Share News

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు.. అసలేమైందంటే..

ABN , Publish Date - Oct 15 , 2024 | 09:26 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఉట్నూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరి కేటీఆర్‌పై ఎవరు ఫిర్యాదు చేశారు? ఎందుకు ఫిర్యాదు చేశారు? పోలీసులు ఏమని కేసు నమోదు చేశారు? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు.. అసలేమైందంటే..
KTR

హైదరాబాద్, అక్టోబర్ 15: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఉట్నూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరి కేటీఆర్‌పై ఎవరు ఫిర్యాదు చేశారు? ఎందుకు ఫిర్యాదు చేశారు? పోలీసులు ఏమని కేసు నమోదు చేశారు? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


ప్రస్తుతం తెలంగాణలో మూసీ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో భారీ దోపిడీకి కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సీరియస్ అయిన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మూసీ ప్రాజెక్టులో రూ. 1.50 లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని.. ఇందులో రూ. 25వేల కోట్లు ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. ప్రజా సొమ్మును లూటీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారామె. కేటీఆర్ ఆరోపణలకు సంబంధించిన విజువల్స్‌ని పోలీసులకు అందజేశారు. వీటి ఆధారంగా ఉట్నూర్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.


Also Read:

ముంబయిలో దారుణం.. చిన్న విషయానికే కొట్టి చంపేస్తారా..

'బెదిరిస్తున్నావా? కుర్చీలోనుంచి కదపండి చూద్దాం'

రోడ్డు పక్కన గోనెసంచి.. ఓపెన్ చేయగా గుండె గుభేల్..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 15 , 2024 | 09:26 PM